Pawan Kalyan: హాట్ టాపిక్ గా వకీల్ సాబ్ రెమ్యునరేషన్.. పవన్ ఎంత అందుకున్నారో తెలుసా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
Pawan Kalyan:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తుంది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఈ సినిమా పై సర్వత్రా ప్రశంశల వెల్లువెత్తుతున్నాయి. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా ఒక పవర్ ఫుల్ కథతో సినిమా చేయడంతో పవన్ అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా పై సినిమా పెద్దలు, సెలబ్రెటీలు తమ అభిప్రాయాలను, ప్రశంశలు కురిపిస్తున్నారు.
‘అత్తారింటికి దారేది’ సినిమా సమయంలో ఆయన 30 కోట్లవరకూ పారితోషికం తీసుకుంటున్నట్టుగా వార్తలు షికారు చేశాయి. చాలా గ్యాప్ తరువాత ఆయన ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకి ఆయన ఎంత తీసుకుని ఉంటారనేది అందరిలో తలెత్తే ప్రశ్న. ఈ సినిమాకి గాను ఆయన పారితోషికంగా 50 కోట్ల వరకూ తీసుకున్నారని ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం పవన్ రెమ్యునరేషన్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు విషయం తెలిసిందే. హరహర వీరమల్లు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా తోపాటు రానా తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు పవన్. అలాగే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు చేస్తున్నాడు పవర్ స్టార్.
మరిన్ని ఇక్కడ చదవండి :