Rewind 2025: ఇక్కడ కూడా రష్మికే.. 2025లో మోస్ట్ పాపులర్ స్టార్స్ వీరే.. టాప్-10 జాబితా రిలీజ్ చేసిన ఐఎమ్‌డీబీ
IMDB ప్రతి సంవత్సరం చివర్లో తన పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తుంది. ఏడాది పొడవునా బాగా ట్రెండింగ్‌లో ఉన్న సెలబ్రిటీలతో టాప్-10 లిస్ట్ ను ప్రకటిస్తుంది. అలా ఈ ఏడాది మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్-10 స్టార్స్ జాబితాను ఐఎమ్ డీబీ రిలీజ్ చేసింది.

సినిమాలు, టీవీ షోలు, సెలబ్రిటీలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని విశ్లేషించి అందించే వేదిక ఐఎండీబీ. ముఖ్యంగా సినిమా రేటింగులకు సంబంధించి ఐఎమ్ డీబీనే ప్రామాణికంగా తీసుకుంటారు. అలాగే ఏటా డిసెంబర్ లో టాప్ సినిమాలు, నటీనటులు, డైరెక్టర్లు.. ఇలా చాలా జాబితాలను విడుదల చేస్తుంది. అలా లేటెస్ట్ గా 2025 సంవత్సరానికి గానూ అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినీ నటులు, దర్శకుల జాబితాను IMDB ప్రకటించింది. ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మికతో పాటు కాంతారా ఛాప్టర్ 1 ఫేమ్ రుక్మిణీ వసంత్, కల్యాణి ప్రియదర్శన్‌లకు స్థానం దక్కింది.
ఈ ఏడాది సంచలన విజయం సాధించిన సైయారా సినిమా హిట్ పెయిర్ అహన్ పాండే, అనీత్ పడ్డా ఐఎమ్ డీబీ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలో మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నారు. ఆమిర్ ఖాన్ మూడవ స్థానంలో ఉన్నారు. యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్ నాలుగో ప్లేస్ లో ఉండగా, ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ లో మెరిసిన లక్ష్య ఐదవ స్థానంలో ఉన్నారు.
ప్రస్తుతం ఇండియాలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా వెలుగొందుతోన్ననేషనల్ క్రష్ రష్మికకు ఈ జాబితాలో ఆరో స్థానం లభించింది. ‘లోకా’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణి ప్రియదర్శన్ 7వ స్థానంలో ఉంది. యానిమల్ బ్యూటీ 8వ ప్లేస్ లో ఉండగా, ‘కాంతార: చాప్టర్ 1’ సెన్సేషన్ రుక్మిణి వసంత్ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఇక కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు.
The stars who had everyone talking this year ⭐ Presenting the Most Popular Indian Stars of 2025. 🎬
Determined by Fans. Always. 💯 pic.twitter.com/8VOXjt5zfi
— IMDb India (@IMDb_in) December 3, 2025
IMDb టాప్ 10 అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ డైరెక్టర్లు..
- మోహిత్ సూరి (సయారా)
- ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్)
- లోకేశ్ కనగరాజ్ (కూలీ)
- అనురాగ్ కశ్యప్ (నిశాంచి, బందర్)
- పృథ్వీరాజ్ సుకుమారన్ (ఎల్2: ఎంపురాన్)
- ఆర్.ఎస్. ప్రసన్న (సితారే జమీన్ పర్)
- అనురాగ్ బసు (మోట్రో ఇన్ దినో)
- డోమినిక్ అరుణ్ (లోక:చాప్టర్1)
- లక్ష్మణ్ ఉటేకర్ (ఛావా)
- నీరజ్ ఘేవాన్ (హోం బౌండ్)
The storytellers who shaped your screens this year. 🎬✨
Presenting the Most Popular Indian Directors of 2025. Whose vision stood out for you? 👀
Determined by Fans. Always. 💯
📍 The IMDb Top 10 Most Popular Indian Directors of 2025 list is comprised of filmmakers who… pic.twitter.com/S30IEjCVF8
— IMDb India (@IMDb_in) December 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








