Nani 30: నాని నయా మూవీ లేటేస్ట్ అప్డేట్ వచ్చేసింది.. ఆకట్టుకుంటోన్న ఎమోషనల్ వీడియో
తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది.
నేచురల్ స్టార్ నానీ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇప్పటికే ఒక మాస్ మసాలా సినిమాను దాదాపు కంప్లీట్ చేశాడు. అదే దసరా.. ఈ సినిమాలో నాని ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు. తెలంగాణ నేపథ్యంలో నటిస్తోన్న చిత్రం కావడం, సింగరేణి నేపథ్యంగా కథ ఉండడంతో చిత్రంపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఏ కథను చెప్పనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్‌లుక్, ధూమ్ ధామ్ దోస్తాన్ ఈ సినిమా పక్కా మాస్ మూవీ అని చెప్పకనే చెప్పింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘నేను లోకల్’ సినిమా తర్వాత ఈ జంట కలిసి నటిస్తోన్న చిత్రం ఇదే కావడం విశేషం. ఫస్ట్‌లుక్, టీజర్స్‌తో ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు.
నేచురల్ స్టార్ నాని 30వ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను నూతన సంవత్సరం సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో నాని ఓ పెద్ద మెడమీద కూర్చొని ఫోటోలు తీస్తూ ఉంటాడు.. ఇంతలో పక్కనే కూర్చొన్న తన కూతురు( ఆన్ స్క్రీన్).. గడ్డం బాలేదని అంటుంది. తీసేస్తా అని చెప్తాడు. అలాగే మీసాలు కూడానా అని అడగ్గా తీసేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత నీకు ఎవరు కావలి అంటూ సినిమా టెక్నీషన్స్ ను పరిచయం చేశాడు నాని. ఇక ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్తో కూడిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని- తండ్రీకూతుళ్ల బాండింగ్ హైలైట్ గా ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మోహన్ చెరుకూరి – డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల – మూర్తికె.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.శౌర్యువ్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.