Sathyaraj: ఏంటీ.. ఆ స్టార్ హీరో కట్టప్ప కొడుకా..? సత్యరాజ్ కొడుకు ఎవరో తెలుసా.. ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యారాజ్. ముఖ్యంగా బాహుబలి సినిమాలోని కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత సహాయ పాత్రలు పోషిస్తూ దక్షిణాదిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే సత్యరాజ్ తనయుడు సైతం హీరో అని మీకు తెలుసా.. ?

తెలుగు సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని హీరో సత్యరాజ్. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సినీ ప్రయాణం స్టా్ర్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత వయసుకు తగిన పాత్రలు పోషిస్తూ సహజ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళంలో అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి మెప్పించాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తెలుగులో శంఖం, మిర్చి, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోహీరోయిన్లకు తండ్రిగా, తాతయ్య పాత్రలు పోషిస్తున్నారు. కానీ సత్యరాజ్ అంటే ఇప్పటికీ కట్టప్ప పాత్రమే గుర్తుకువస్తుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు సత్యరాజ్. మరోవైపు ఆయన కూతురు న్యూట్రిషియన్. అలాగే రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. మరోవైపు సత్యరాజ్ తనయుడు మాత్రం సినిమాల్లో హీరోగా రాణిస్తున్నాడు అనే విషయం తెలిసిందే. సత్యరాజ్ కొడుకు పేరు సిబిరాజ్. ప్రస్తుతం తమిళంలో హీరోగా దూసుకుపోతున్నాడు. చెన్నైలోని లయోలా కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన అతడు.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
2003లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హీరోగా సినీప్రయాణం స్టార్ట్ చేశాడు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత జోర్, మన్నిన్ మైందన్, వెట్రివేల్ శక్తివేల్, కోవై బ్రదర్స్ వంటి చిత్రాల్లో నటించాడు. తమిళం సినిమాలో హీరోయిజం సినిమాలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ఇక చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రేవతిని పెళ్లి చేసుకున్నాడు సిబిరాజ్. వీరికి బాబు, పాప ఉన్నారు. ప్రస్తుతం సిబిరాజ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..



