AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robinhood OTT: రాబిన్ హుడ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! నితిన్, శ్రీలీల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఆ మధ్యన సంక్రాంతికి వస్తున్నాం, కింగ్ స్టన్ సినిమాలు ఒకేసారి ఓటీటీ, టీవీ ఛానెల్స్ లోనూ ప్రసారమైంది. ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ సినిమా కూడా అదే బాటలో పయనిస్తోంది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా ఒకేసారి ఓటీటీ, టీవీల్లో సందడి చేయనుంది.

Robinhood OTT: రాబిన్ హుడ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! నితిన్, శ్రీలీల సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Robinhood Movie
Basha Shek
|

Updated on: May 04, 2025 | 10:29 AM

Share

యూత్ స్టార్ నితిన్ , గ్లామరస్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్ హుడ్. ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ మూవీ తర్వాత మరోసారి ఈ మూవీలో జంటగా కనిపించారీ జోడీ. అయితే రిజల్ట్ మాత్రం సేమ్. ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్ మూవీ లాగే రాబిన్ హుడ్ సినిమా కూడా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. ఛలో, భీష్మ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆసీస్ డ్యాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించడం తో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే క్రేజీ హీరోయిన్ కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించడం, అది కాస్తా వివాదాస్పదం కావడం..ఇలా రిలీజ్ కు ముందే రాబిన్ హుడ్ సినిమా వార్తల్లో నిలిచింది. అయితే తీరా థియేటర్లలోకి వచ్చాక మాత్రం సినిమా పూర్తిగా నిరాశ పర్చింది. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో రిలీజైన రాబిన్ హుడ్ కు మొదటి నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఆ టాక్ అలాగే కంటిన్యూ అయ్యింది. దీంతో కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. నితిన్- శ్రీలీల జోడీ ఆకట్టకున్నా కథా, కథనాలు ఆడియెన్స్ ను బాగా నిరాశపర్చాయి. ఇక ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా కొద్ది సేపు మాత్రమే కనిపించడంతో ఆడియెన్స్ డిజప్పాయింట్ అయ్యారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన రాబిన్ హుడ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

రాబిన్ హుడ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు, శాటిలైట్ హక్కులను జీ5, జీ5 తెలుగు సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ సినిమా టీవీ ప్రీమియర్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 10న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ‘జీ తెలుగు’ ఛానల్‌లో ప్రసారం కానుందని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే ఓటీటీ రిలీజ్‌ డేట్‌ మాత్రం వెల్లడించలేదు. కానీ, అదే టైమ్‌కి ఓటీటీలోనూ రాబిన్ హుడ్ ను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన రాబిన్ హుడ్ సినిమాలో వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్, షిజు, మైమ్ గోపీ, ఆడుకలం నరేన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..