- Telugu News Photo Gallery Cinema photos Sidharth Malhotra is mostly pairing up with famous actresses in the South
Sidharth Malhotra: సిద్ధార్థ్ టార్గెట్ సౌత్ హీరోయిన్సే.. నెక్స్ట్ ఆ ఇద్దరే..
సౌత్‌లో ఫేమస్ అయిన నాయికలతో ఎక్కువగా జోడీ కడుతున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. తన సినిమాలకు సౌత్‌లోనూ మంచి గుర్తింపు రావాలనే హ్యాండ్సమ్ హీరో ఈ ట్రిక్‌ని ఫాలో అవుతున్నారంటున్నారు క్రిటిక్స్. మరి అయన కాదండి.? నెక్స్ట్ సినిమా కోసం ఫిక్స్ అయన సౌత్ ముద్దుగుమ్మ ఎవరు.? ఈరోజు తెలుసుకుందాం రండి..
Updated on: May 04, 2025 | 11:09 AM

షేర్‌షా సినిమా థియేటర్లలో రిలీజ్ కాకపోయినా ఓటీటీకే పరిమితమైనా, ప్రజల మనసులను టచ్ చేసింది. అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆ మూవీని గుర్తుచేసుకుంటుంటారు ఫ్యాన్స్. సిద్, కియారా కెమిస్ట్రీ అదుర్స్ అంటూ సౌత్ నుంచి కాంప్లిమెంట్లు కూడా అందాయి.

అప్పటి నుంచి తన సినిమాల్లో సౌత్ హీరోయిన్లను ప్రిఫర్ చేస్తున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. మిషన్ మజ్నులో రష్మిక మందన్నతో కలిసి మెప్పించారు. మిషన్ మజ్ను తన కెరీర్లో చాలా స్పెషల్ అని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు రష్మిక.

సిద్ధార్థ్ మల్హోత్రా నెక్స్ట్ సినిమాలో నాయికగా అనన్య పాండే పేరు వినిపించింది. అనన్య ఆల్రెడీ లైగర్ సినిమాతో సౌత్ ఆడియన్స్ కి పరిచితమే. ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే, ఈ పాటికే సౌత్‌లో హల్‌చల్ చేసేవారు. సిద్ధార్థ్ సినిమాతో అయినా హిట్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు ఆమె అభిమానులు.

అనన్యను అప్రోచ్ అయిన మేకర్స్ లేటెస్ట్గా శ్రీలీల కాల్షీట్ అడుగుతున్నారట. అయితే శ్రీలీల ఇప్పటికి హిందీలో ఆషికీ 3 సినిమాలో కథనయికగా నటించింది. ఇది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సిద్ధార్థ్ మల్హోత్రాతో అనన్య అండ్ శ్రీలీల ఇద్దరూ కలిసి నటిస్తారా? లేకుంటే ఇద్దరిలో ఒకరే సెలక్ట్ అవుతారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో ఏది జరిగినా సిద్ధార్థ్ సౌత్ కొలాబరేషన్ కంటిన్యూ అవుతుందన్నది మాత్రం నిజం.




