- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Who Was Grand Daughter Of Hyderabad Nizam, She Is Crazy Heroine Adithi Rao Hydari
Tollywood: హైదరాబాద్ నిజాం నవాబు మనవరాలు.. ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. సినిమా ఆఫర్స్ లేక చివరకు..
భారతీయ సినీ పరిశ్రమలో తక్కువ సమయంలోనే నటిగా తనదైన ముద్ర వేసింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇటీవలే ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
Updated on: May 04, 2025 | 12:40 PM

ఆమె హైదరాబాద్ నిజాం నవాబు మనవరాలు. అలాగే వనపర్తికి చివరి రాజు అయిన రామేశ్వర్ రావు రాజు మనవరాలు. రాజవంశానికి చెందిన ఈ అమ్మడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంది. ఇంతకీ ఈ చిన్నారిని గుర్తుపట్టారా.. ?

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అదితి రావు హైదరీ. 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో ఎహసాన్ హైదరీ, విద్యారావు దంపతులకు జన్మించింది. ఆమెకు రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.

2007లో భరతనాట్యం నర్తకిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. అదే సంవత్సరంలో రొమాంటిక్ అనే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు మొత్తం 26కు పైగా సినిమాల్లో నటించింది. ఢిల్లీ 6 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

దుల్కర్ సల్మాన్ నటించిన హై సినిమిక సినిమాలో కనిపించింది. ఆ తర్వాత డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హిరామండి సినిమాతో నటిగా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఇటీవలే హీరో సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకుంది.

మహాసముద్రం సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే తనకు సినిమా అవకాశాలు రాని సమయంలో సిద్ధా్ర్థ్ తో పెళ్లి పీటలు ఎక్కినట్లు అదితి ఇటీవల వెల్లడించింది.




