Tollywood: ఈ ఫోటోలో ఓ స్టార్ హీరో ఉన్నారు ఎవరో గుర్తుపట్టండి.. ఆయన కోసం ప్రాణాలిచ్చే కోట్లాది మంది అభిమానులు..

పైన ఫోటోను చూశారు కదా. కాలేజీ చదువుతున్న సమయంలో తన స్నేహితులతో కలిసి తీసుకున్న ఫోటో ఇది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు.

Tollywood: ఈ ఫోటోలో ఓ స్టార్ హీరో ఉన్నారు ఎవరో గుర్తుపట్టండి.. ఆయన కోసం ప్రాణాలిచ్చే కోట్లాది మంది అభిమానులు..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 25, 2023 | 5:08 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో టీనేజ్ ఫోటో వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. కాలేజీ చదువుతున్న సమయంలో తన స్నేహితులతో కలిసి తీసుకున్న ఫోటో ఇది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు. ఆయన పేరు చెబితే తెలుగు ప్రజల పెదాలపైకి చిరునవ్వు వచ్చేస్తుంది. తెలియకుండానే ఆహీరోపై గౌరవం వచ్చేస్తుంది. చిత్రపరిశ్రమలో ఎంతో మంది నటీనటులకు ఆయనే స్పూర్తి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ హీరో. ఎవరో గుర్తుపట్టండి.

అందులో ఉన్న హీరో ఎవరా అనుకుంటున్నారా ?.. తనే మెగాస్టార్ చిరంజీవి. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు ముద్దుగా అన్నయ్య అని పిలుచుకుంటారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ హీరో అయ్యారు. చిరు నటించిన తొలి చిత్రం పునాది రాళ్లు. కానీ ఈ సినిమా కంటే ముందు ప్రాణం ఖరీదు విడుదలై సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత మనవూరి పాండవులు, తాయారమ్మ బంగారయ్య, ఇది కథ కాదు చిత్రాల్లో నటించారు. ఇక 1982లో డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ఆయన కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి
Chiranjeevi

Chiranjeevi

ప్రస్తుతం చిరు భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు చెల్లిగా నటిస్తుండగా.. తమన్నా కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.