Rajitha Chanti |
Updated on: Feb 25, 2023 | 4:53 PM
ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు జోనిత గాంధీ. ఎన్నో చార్ట్ బస్టర్ పాటలు పాడి పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఆమె గాత్రానికి శ్రోతలు ఫిదా అయ్యారు. జోనిత పాట పాడిందంటే హిట్ అవ్వాల్సిందే అన్న స్థాయికి చేరుకుంది ఈ బ్యూటీ క్రేజ్.
జోనిత గాంధీ.. కెనడా దేశానికి చెందిన మహిళ. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో పాటలు పాడడం మొదలుపెట్టింది.
ఆ తర్వాత పలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాలకి పాటలు పాడటం మొదలుపెట్టింది. తెలుగులోకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పరిచయం చేశాడు.
‘కిక్2’ సినిమాలో ‘నువ్వే నువ్వే’ ప్రాణం అనే పాటని పాడింది. బీస్ట్, సర్కారు వారి పాట.. వంటి సినిమాల్లో పాటలు పాడి ఇంకా ఫేమస్ అయ్యింది.
అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ షోలతో రచ్చ చేస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు మించి గ్లామర్ షోలత నెట్టింటిని షేక్ చేస్తుంది. ప్రస్తుతం జోనిత గాంధీ ఫోటోస్ వైరలవుతున్నాయి.