Tollywood: స్టార్ హీరోతో పెళ్లి క్యాన్సిల్.. కట్ చేస్తే.. పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ పాప ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బడా హీరోల సినిమాల్లో కచ్చితంగా ఈ ముద్దుగుమ్మ ఉండాల్సిందే. ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటోన్న ఈ క్రేజీ హీరోయిన్ పేరు మరోసారి ట్రెండ్ అవుతోంది.
చాలామంది హీరోయిన్ల లాగే ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది. ఒక సూపర్ హిట్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అంతలోనే తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడింది. ఇరు పెద్దల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడెన్ గా నిశ్చితార్థం రద్దు చేసుకుంది. కట్ చేస్తే.. ఆ హీరోయిన్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఏ భాషలోనైనా పాన్ ఇండియా సినిమ తెరకెక్కుతోందంటే అందులో దాదాపు ఈ హీరోయిన్ ఉండాల్సిందే. అంతలా క్రేజ్ సొంతం చేసుకుందీ అందాల తార. ఇప్పుడు కూడా ఈ బ్యూటీ పేరు తెగ మార్మోగిపోతోంది. ఆమె నటించిన ఒక సినిమా దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? యస్. తను మరెవరో కాదు పుష్ప 2తో మరో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న రష్మిక మందన్నా. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో రష్మికకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. పై ఫొటో కూడా అదే.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎప్పటిలాగే పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అభినయం అదిరిపోయిందని ప్రశంసలు వినిపిస్తున్నాయి .అదే సమయంలో పుష్ప రాజ్ భార్యగా శ్రీ వల్లి కూడా యాక్టింగ్ అద్బుతమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతర సీన్స్ లో రష్మిక అభినయం అల్లు అర్జున్ ను డామినేట్ చేసిందంటున్నారు. మొత్తానికి పుష్ప 2 సినిమాతో రష్మిక క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిందని చెప్ప వచ్చు.
అల్లు అర్జున్ తో రష్మిక..
View this post on Instagram
పుష్ప 2 తర్వాత రష్మిక చేతిలో పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ధనుష్, నాగార్జునలతో కలిసి కుబేర అనే క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది రష్మిక. దీంతో పాటు సల్మాన్ సికిందర్ లోనూ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ మెయిన్ లీడ్ పోషిస్తోంది. కాగా 2017లోనే రిషబ్ శెట్టితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది రష్మిక. అయితే కొన్ని కారణాలతో ఆ తర్వాత దానిని రద్దు చేసుకుంది.
పుష్ప 2 సినిమాలో రష్మిక..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..