Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ నుంచి రోహిణి ఎలిమినేట్.. 9 వారాల్లో ఎన్ని లక్షలు సంపాదించిందో తెలుసా?
బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తుది అంకానికి వచ్చేసింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు మరో వారంలో ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం ఫినాలే వీక్ రసవత్తరంగా జరగుతోంది.
బుల్లితెర ఆడియెన్స్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 8వ సీజన్ చివరకొచ్చేసింది. మరో వారంలో ఈ షో ముగియనుంది. ఇక వచ్చేవారమంతా హౌస్ లో ఫినాలే వీక్ జరగనుంది. ఇందుకు టాప్-5 కంటెస్టెంట్స్ మాత్రమే అర్హులు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పనిసరైపోయింది ఇందులో భాగంగా శనివారం (డిసెంబర్ 08) నాటి ఎపిసోడ్ లో జబర్దస్త్ కమెడియన్ రోహిణీని ఎలిమినేట్ చేశారు. టాప్-5 కచ్చితంగా ఉంటుందనుకున్న రోహిణీ అనూహ్యంగా బయటకు రావడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ఫినాలేలో అడుగుపెట్టనప్పటికీ తన ఆట, మాట తీరుతో అందరి మన్ననలు గెల్చుకుంది రోహిణి. అంతేకాదు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ కూడా అందుకుంది. గతంలోనే బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చిన రోహిణీ ఎనిమిదో సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ కంటే తానే చాలా బెటర్ అనిపించుకుంది. ఓ వైపు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే ఫిజికల్ టాస్కుల్లోనూ సత్తా చాటింది. ఓటింగ్ లోనూ సత్తా చాటింది. అయితే టాప్-5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి దాపరించింది.
ఇక బిగ్ బాస్ 8వ సీజన్‌లో రోహిణి దాదాపు 9 వారాల పాటు ఉంది. కాగా హౌసులోకి వచ్చేముందే వారానికి రూ.2లక్షల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమె సుమారు రూ.18 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
లేడీ ఫైటర్ గా ప్రశంసలు..
View this post on Instagram
కాగా తన మాటలు, నటనతో ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తే రోహిణీ గతంలో నూ బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొంది. మూడో సీజన్ మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. అయితే పెద్దగా రెమ్యునరేషన్ అందుకోలేదు. ఈసారి మాత్రం ఆమె భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో రోహిణి..
View this post on Instagram
జబర్దస్త్ రోహిణి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.