AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Sai Kiran: నటిని పెళ్లి చేసుకున్న గుప్పెడంత మనసు మహేంద్ర.. సాయి కిరణ్, స్రవంతి పెళ్లి వీడియో వైరల్..

సినీరంగంలో హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు బుల్లితెరకు పరిమితమయ్యారు సాయి కిరణ్. చేతినిండా పలు సీరియల్స్ తో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. కోయిలమ్మ, గుప్పెడంత మనసు, పడమటి సంధ్యారాగం వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సాయి కిరణ్ తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.

Actor Sai Kiran: నటిని పెళ్లి చేసుకున్న గుప్పెడంత మనసు మహేంద్ర.. సాయి కిరణ్, స్రవంతి పెళ్లి వీడియో వైరల్..
Sai Kiran
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 09, 2024 | 3:53 PM

Share

నువ్వే కావాలి, ప్రేమించు సినిమాల ద్వారా హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు. తనదైన నటనతో అప్పట్లో హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు. కోయిలమ్మ, గుప్పెడంత మనసు, పడమటి సంధ్యారాగం సీరియల్స్ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. స్రవంతి, సాయి కిరణ్ కోయిలమ్మ సీరియల్లో కలిసి నటించారు. ఆదివారం (డిసెంబర్ 8న) వీరిద్దరి వివాహం ఘనంగా జరగ్గా.. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రెటీలు హాజరైనట్లు తెలుస్తోంది.

తాజాగా తన పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇవాళ పెళ్లి జరిగింది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు సాయి కిరణ్. దీంతో సాయి కిరణ్ దంపతులకు తారలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బుల్లితెర నటీనటులు ముఖేష్ గౌడ, రక్షా, మీనా వాసు విషెస్ చెప్పారు. ప్రస్తుతం సాయి కిరణ్ మ్యారేజ్ వీడియో నెట్టింట వైరలవుతుంది.

సాయి కిరణ్ తండ్రి రామకృష్ణ తెలుగులో ప్రముఖ సింగర్. నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ప్రేమించు సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో సాయి కిరణ్ సరసన లయ నటించింది. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ జాతకాలు కుదరకపోవడంతో పెళ్లి పీటల వరకు వెళ్లలేకపోయింది. సాయి కిరణ్ 2010లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. కానీ ఇద్దరు మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న సాయి కిరణ్ ఇప్పుడు తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నారు.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.