Abbas: అబ్బాస్‌తో ఉన్న ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు క్రేజీ హీరో.. లవ్ స్టోరీలు కూడా ఎక్కువే
ప్రేమదేశం సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు హీరో అబ్బాస్. ముఖ్యంగా ఈ సినిమాలో అతని హెయిర్ స్టైల్ అయితే కుర్రకారుకు పిచ్చెక్కించింది. ఇక అమ్మాయిల అయితే అబ్బాస్ ను తమ కలల రాకుమారుడిగా భావించారు. అయితే అబ్బాస్ కు సంబంధించిన ఫొటో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది.
ప్రేమదేశం సినిమాతో అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు అబ్బాస్. దీని తర్వాత కూడా పలు సినిమాల్లో సోలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. అయితే క్రమంగా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో తన ఫ్యామిలీతో కలిసి సెటిలైపోయాడీ హ్యాండ్సమ్ హీరో. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే.. పైన కనిపిస్తోన్న ఫొటోను చూశారా? అందులో ఎవరు ఉన్నారు అంటే వెంటనే అబ్బాస్ అని చెప్పేస్తారు. అందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. అయితే అబ్బాస్ పక్కన కూర్చున్నదెవరో గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు ఒక స్టార్ హరో. లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైన్ సినిమాలతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. అన్నట్లు ఈ నటుడు సినిమాలతో పాటు ప్రేమ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖ్యంగా ఒక తెలుగు క్రేజీ హీరోయిన్ తో ప్రేమలో మునిగినట్లు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. మరి అబ్బాస్ పక్కనున్న ఈ నటుడెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయతే సమాధానం మేమే చెబుదాం లెండి. ఈ హీరో మరెవరో కాదు జర్నీ, రాజా రాణి లాంటి సినిమాలతో క్రేజీ హీరోగా మారిపోయిన జై. ఇది అతని చిన్నప్పటి ఫొటో. ఇందులో హీరో అబ్బాస్ జై మీద ఉండటంతో.. వీరి మధ్య మంచి అనుబంధం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ఈ ఫొటో ఎప్పటిది.. ఏ సందర్భంలో తీశారన్నది మాత్రం తెలియడం లేదు. అయితే ఏదో సినిమా పంక్షన్ లో నే ఈ ఫొటో క్లిక్ మనిపించినట్లు బ్యాక్ గ్రౌండ్ చూస్తే అర్థమవుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. తెలుగు హీరోయిన్ అంజలి, జై ప్రేమలో ఉన్నట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. పెళ్లి కూడా చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. తెలుగులో ఎక్కువగా కనిపించకపోయినా ప్రస్తుతం తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు జై. చివరిగా నయనతారతో కలిసి అన్నపూరణి అనే సినిమాలో కనిపించాడు జై. ప్రస్తుతం ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో.
హీరో జై లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.