గేమ్ ఛేంజర్‌కు రెమ్యునరేషన్ తగ్గించుకున్న రామ్ చరణ్.. ఎంత తీసుకున్నాడంటే?

02  January 2025

Basha Shek

రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

త్వరలోనే గేమ్ ఛేంజర్ సినిమాతో మన ముందుకు రానున్నాడు రామ్ చరణ్‌. శంకర్ ఈ సినిమాకు దర్శకుడు.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా తొలుత  గేమ్ ఛేంజర్ సినిమా కోసం మొత్తం  బడ్జెట్‌ దాదాపు   300 కోట్ల రూపాయలు అనుకున్నారట.

ఇందులోనే  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు రెమ్యునరేషన్‌నే దాదాపు 100 కోట్లు అని ప్రచారం జరిగింది

కాగా సినిమా షూటింగ్‌ ఆలస్యం కావడంతో ఈ మూవీ బడ్జెట్ రూ. 500 కోట్ల వరకు‌ పెరిగిందని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా రామ్ చరణ్‌ తన రెమ్యునరేషన్‌ తగ్గించినట్లు తెలుస్తోంది. 

100 కోట్లలో దాదాపు రూ.35 కోట్లను తగ్గించి రూ. 65 కోట్లను మాత్రమే పారితోషికంగా రామ్ చరణ్ తీసుకున్నాడట.