Janaka Aithe Ganaka OTT: కండోమ్ కంపెనీపై కేసు.. అప్పుడే ఓటీటీలో సుహాస్ లేటెస్ట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్. ఈ ఏడాదిలో ఇప్పటికే అతను నటించిన సినిమాలు దాదాపు అరడజను సినిమాలు విడుదలయ్యాయి. అమ్మాయి మ్యారేజ్ బ్యాండ్, శ్రీరంగ నీతులు, ప్రసన్నవదనం, డార్లింగ్ (స్పెషల్ అప్పియరెన్స్), గొర్రె పురాణం, జనక అయితే గనక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన తాజా చిత్రం జనక అయితే గనక. సంగీర్తన విపిన్ కథానాయికగా నటించింది. సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ రాజు బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. సినిమా పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముంద ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే అక్టోబర్ 12న విడుదలైన జనక అయితే గనక పాజిటివ్ టాక్ నే తెచ్చుకుంది. కామెడీ కూడా బాగుందనే ప్రశంసలు వచ్చాయి. అయితే కోర్టు రూమ్ సన్నివేశాలు మరీ ఎక్కువైపోవడంతో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. జనక అయితే గనక సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ఓటీటీ ప్రకటన వచ్చేసింది. నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేస్తామని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ‘నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ రోలర్ కాస్టర్ రైడ్ కు రెడీగా ఉండండి’ అంటూ ఈ సినిమా పోస్టర్ ను కూడా పంచుకుంది.
జనక అయితే గనక సినిమా కథ విషయానికి వస్తే..బిడ్డలు పుడితే ఖర్చులు పెరుగుతాయనే భయపడే ఓ కుర్రాడు, భార్య నెల తప్పిందని చెప్పడంతో షాకవుతాడు. తాను కండోమ్ ఉపయోగించినప్పటికీ తండ్రి కావడం అతనిని షాక్ కు గురి చేస్తుంది. దీంతో అతను సదరు కండోమ్ కంపెనీపై కేసు పెడతాడు. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ సినిమా కథ. చెప్పుకోవడానికి కాస్త వల్గర్ గా అనిపించినా అసభ్యతకు ఏ మాత్రం తావు లేకుండా సున్నితమైహ హాస్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చారు.
నెలరోజుల్లోపే ఓటీటీలోకి సుహాస్ సినిమా
Prepare yourself for a rollercoaster of emotions and non-stop entertainment 💯💥
#janakaaitheganaka premieres on 8 th November only on #aha #janakaaitheganakaonaha@ActorSuhas @sangeerthanaluv @KalyanKodati@kk_lyricist @HR_3555 #HanshithaReddy@DilRajuProdctns pic.twitter.com/bkhzNbPXL3
— ahavideoin (@ahavideoIN) October 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.