Sachin Tendulkar: సచిన్‌తో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. తండ్రి కూడా తెలుగు హీరోనే..
సాధారణంగా సినీతారలకు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రెటీల త్రోబ్యాక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుంటాయి. తాజాగా తెలుగు క్రేజీ యంగ్ హీరో ఫోటో ఒకటి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కు సంబంధించిన ఓ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో సచిన్ తోపాటు ఉన్న చిన్నోడు ఎవరా అని ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తెలుగులో అతడు క్రేజీ హీరో. అంతేకాదు.. అతడి తండ్రి సైతం తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఫ్యామిలీ అడియన్స్, మహిళలకు అతడి తండ్రికి వీరాభిమానులు. తండ్రి బాటలోనే సినీరంగంలోకి నటుడిగా అరంగేట్రం చేసిన ఈ చిన్నోడు ఇప్పుడు తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. మాస్ లుక్, ఎనర్జిటిక్ డ్యాన్సులతో యూత్ కు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాతోపాటు మరో క్రేజీ ప్రాజెక్టులోనూ నటిస్తున్నాడు. ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది. తెలుగులో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోలలో ఈ కుర్రాడు ఒకరు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. అతడే సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్.
శ్రీకాంత్ తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాతో వెండితెరపై సందడి చేసిన రోషన్.. ఆ తర్వాత హీరోగా పెళ్లి సందడి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షించారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటించగా.. ఫస్ట్ మూవీతోనే రోషన్, శ్రీలీల ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ సినిమా తర్వాత రోషన్ కు హీరోగా మంచి ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం వృషభ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు మలయాళంలోనూ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మోహన్ లాల్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే రోషన్ చేతిలో మరో తెలుగు ప్రాజెక్ట్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రోషన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..