Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ఎంఎస్‌ ధోని.. ‘యానిమల్’ దించేశారుగా.. వీడియో వైరల్

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించిన చిత్రం 'యానిమల్' బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు బాగా హైలెట్ అయ్యాయి. ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 'యానిమల్' సినిమాలో రణ్‌బీర్ కపూర్ పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు.

MS Dhoni: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ఎంఎస్‌ ధోని.. 'యానిమల్' దించేశారుగా.. వీడియో వైరల్
MS Dhoni
Follow us
Basha Shek

|

Updated on: Mar 18, 2025 | 8:44 PM

రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో కంటెంట్ పరంగా ఈ సినిమా పలు వివాదాలు ఎదుర్కొంది. సినిమాలో మితిమీరిన హింస ఉందని, ఆడవారిని చాలా తక్కువగా చేసి చూపించారని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు వచ్చాయి. ఇక సినిమా ఆఖరులో వచ్చే సీన్ అయితే మరీ బోల్డ్ గా ఉందని కామెంట్స్ వచ్చాయి. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అదే యానిమల్ సినిమాలో రణ్‌బీర్ పాత్రలో నటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇక్క విశేషమేమిటంటే.. దీనికి కూడా సందీప్ రెడ్డి వంగా నే దర్శకత్వం వహించాడు. అయితే ధోని నటించింది సినిమాలో కాదు. ఒక వాణిజ్య ప్రకటనలో. ఐపీఎల్ -2025 మార్చి 22న అట్టహాసంగా ప్రారంభం కానుంది. దీంతో వివిధ కంపెనీలు క్రికెటర్లతో పోటీ పడి మరీ యాడ్స్ తీస్తున్నాయి. ఈ క్రమంలోనే ధోని యానిమల్ మూవీ తరహాలో ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించాడు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ చిత్రం తరహాలోనే ఎలక్ట్రిక్ సైకిల్ ప్రకటనలో ధోని నటించాడు. ‘యానిమల్’ సినిమాలోని బాగా హైలెట్ సన్నివేశాలను ఈ ప్రకటనలో రీక్రియేట్ చేశారు. ఇక ధోని కూడా రణ్‌బీర్ తరహాలోనే నటించాడు. పొడవాటి జుట్టు ఉండటమే కాకుండా, సినిమాలో రణ్‌ బీర్ వేసుకున్న దుస్తులనే ధరించాడు. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తన బావమరిదిని చంపడానికి తన గ్యాంగ్ సభ్యులతో కలసి వెళ్తాడు. అలాగే సినిమా ప్రారంభంలో రష్మిక మందన్నాను కలవడానికి బైక్‌పై స్టైల్‌గా వస్తాడు. అయితే ఈ యాడ్ లో మాత్రం ధోని ఎలక్ట్రిక్ సైకిల్‌పై వస్తాడు. ఇక చివరి సన్నివేశంలో కూడా రణ్ బీర్ లాగే ధోని కూడా ఓ బోల్డ్ సైన్ ఇస్తాడు. ఈ ప్రకటనలో సందీప్ రెడ్డి వంగా కూడా నటించడం విశేషం. ఈ ప్రకటన ఈరోజే (మార్చి 18) విడుదలైంది. ప్రస్తుతం ఈ యాడ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

యానిమల్ ఫర్ ఏ రీజన్.. యాడ్ లో ఎం ఎస్ ధోని..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి