AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Orry: పవిత్ర వైష్ణో దేవి ఆలయం వద్ద వెర్రి వేషాలు.. ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన ఓర్రీ.. కేసు నమోదు

బాలీవుడ్ సోషలైట్ అండ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమా ఈవెంట్లు, పార్టీలు, ఫంక్షన్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ సినీ తారలతో చిత్ర విచిత్రమైన పోజులు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటాడీ ఫేమస్ పర్సనాలిటీ.

Orry: పవిత్ర వైష్ణో దేవి ఆలయం వద్ద వెర్రి వేషాలు.. ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన ఓర్రీ.. కేసు నమోదు
Bollywood Influencer Orry
Basha Shek
|

Updated on: Mar 17, 2025 | 7:13 PM

Share

బాలీవుడ్ సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, పార్టీల్లో తరచూ కనిపించే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి వివాదంలో ఇరుక్కున్నాడు. పవిత్ర వైష్ణోదేవి ఆలయంలో అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు అతనితో పాటు మరో ఏడుగురిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఓర్రీ ఇటీవలే తన ఏడుగురు స్నేహితులతో కలిసి జమ్ము కశ్మీర్‌లోని వైష్ణో దేవి మాతా ఆలయానికి వెళ్లాడు. అక్కడి ఓ హోటల్లో భోజనం చేసేందుకు దిగారు. అందరూ కలిసి కడుపు నిండా తిన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. అక్కడే తమ వెంట తెచ్చుకున్న ఓ మందు బాటిల్ విప్పి భోజనం చేస్తూ తాగేశారు. ఈ విషయం గుర్తించిన కొందరు స్థానికులు దాన్ని ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హోటల్ కు వెళ్లి మరీ దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఫిర్యాదు చేసినట్లుగానే ఓర్రీ అతని ఏడుగురు స్నేహితులు మద్యం సేవించినట్లు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత వారందరిపై కేసులు నమోదు చేశారు. ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి, శ్రీ దర్శన్ సింగ్, శ్రీ పార్థ్ రైనా, శ్రీ రితిక్ సింగ్, శ్రీమతి రాశి దత్తా, శ్రీమతి రక్షిత భోగల్, శ్రీ గుషన్ కోహ్లీ, శ్రీమతి అర్జమస్కినాలపై కేసులు పెట్టారు. ఈ విషయాన్ని జమ్మూ కశ్మీర్ పోలీసు అధికారులే మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

దివ్య మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర స్థలం కాబట్టి ఇక్కడ మాంసం, మద్యపాన నిషేధం ఉందని పోలీసులు తెలిపారు. అలాంటి పవిత్రమైన స్థలంలో ఓర్రీ తన స్నేహితులతో కలిసి చట్ట విరుద్ధంగా మద్యం సేవించారని.. అందుకే వారిపై కేసులు పెట్టామని పోలీసులు వివరించారు. మత పరమైన ప్రదేశాల్లో భక్తుల మనోభావాలు తెబ్బతీసేలా వ్యవహరిస్తే.. వారు ఎంత పెద్ద వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని జమ్మూ పోలీసులు హెచ్చరించారు. ఓర్రీ అండ్ గ్యాంగ్ ను గుర్తించి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కాత్రా ఎస్పీ వెల్లడించారు.

ఎవరినీ వదిలి పెట్టం: జమ్మూ పోలీసులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి