Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahnavi Dasetty: తల్లిగా ప్రమోషన్ పొందిన మహాతల్లి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జాహ్నవి.. పోస్ట్ వైరల్

యూట్యూబ్‌ ను బాగా ఫాలో అయ్యే వారికి మహా తల్లి అలియాస్ జాహ్నవి దాశెట్టి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుకు సంబంధించి మొదటి యూట్యూబర్‌గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. దీంతో పాటు పలు తెలుగు సినిమాల్లోనూ మహా తల్లి మెరిసింది.

Jahnavi Dasetty: తల్లిగా ప్రమోషన్ పొందిన మహాతల్లి.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జాహ్నవి.. పోస్ట్ వైరల్
Jahnavi Dasetty
Follow us
Basha Shek

|

Updated on: Mar 16, 2025 | 5:00 PM

ఫేమస్ యూటబ్యూటర్, ప్రముఖ నటి మహాతల్లి అలియాస్ జాహ్నవి దాసెట్టి శుభవార్త చెప్పింది. తాను తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియ వేదికగా వెల్లడించిందీ అందాల తార. తనకు పండంటి ఆడ బిడ్డ జన్మించినట్లు ఆదివారం (మార్చి 16) ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జాహ్నవికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జాహ్నవి పోస్ట్ చూసిన వరుణ్ సందేశ్ సతీమని వితికా షేరు మహా తల్లికి అభినందనలు తెలిపింది. అలాగే అందమైన మహాలక్ష్మిని ఈ లోకంలోకి తీసుకొచ్చినందుకు జాహ్నవి దంపతులకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది జాహ్నవి.. గతేడాది గర్భం దాల్చినట్లు వెల్లడించింది. అప్పటినుంచి తన ప్రెగ్నెన్సీ జర్నీని ఫొటోలు, వీడియోల రూపంలో షేర్‌ చేస్తూనే ఉంది. భర్తతో కలిసి ఫోటోలు దిగుతూ వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంది. తాజాగా తమ వైవాహిక బంధానిక ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించింది మహా తల్లి.

ఇవి కూడా చదవండి

కాగా మహాతల్లి అలియాస్ జాహ్నవి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్. నిఫ్ట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు చదివింది. కానీ షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. మొదట్లో షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌ హరీశ్‌ నాగరాజుతో కలిసి కొన్ని లఘుచిత్రాలకు పని చేసింది. అందులో భాగంగానే మహాతల్లి- మహానుభావుడు అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్‌ ఏ రేంజ్‌లో క్లిక్‌ అయిందంటే ఇప్పటికీ జాహ్నవిని మహాతల్లిగానే జనాలు గుర్తుపెట్టేసుకున్నారు. ఇప్పటికీ అలాగే పిలుస్తున్నారు. దీని తర్వాత మహా తల్లి పేరుతో తనే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది జాహ్నవి. వెబ్‌ సిరీస్‌లు, సరదా వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో బాగా పాపులర్‌ అయింది.

మహా తల్లి లేటెస్ట్ పోస్ట్..

అన్నట్లు జాహ్నవి కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. నితిన్ లై, శ్రీ విష్ణు మెంటల్‌ మదిలో సినిమాల్లో మహా తల్లి మెరిసింది. ఇక కొందరు సినిమా సెలబ్రిటీలను కూడా జాహ్నవి ఇంటర్వ్యూలు చేసింది.

భర్తతో జాహ్నవి..

నిహారిక, వితికా శేరులతో మహా తల్లి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి