Pushpa 3 Movie: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. పుష్ప 3 రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక పుష్ప 2 సినిమాతో భారతీయ సినిమా బాక్సాఫీస్ రికార్డులు దులిపేశాడు. దీంతో పుష్ప 3 ఎప్పుడు? అని బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వీటికి సమాధానం దొరికింది. .

పుష్ప 1 సినిమా 2021లో రిలీజైంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇందులోని పాటలు, డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ లు పాన్ వరల్డ్ రేంజ్ లో ఫేమస్ అయ్యాయి. ఇక గతేడాది రిలీజైన పుష్ప 2 ఏకంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తద్వారా ఆమిర్ ఖాన్ దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా పుష్ప 2 రికార్డుల్లోకి ఎక్కింది. కాగా పుష్ప 2 సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు రిలీజవుతుంది? అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా పుష్ప 3 సినిమా గురించి నిర్మాత రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 2028లో పుష్ప 3 సినిమాను విడుదల చేస్తామని వెల్లడించాడు. రాబిన్ హుడ్ ప్రమోషన్లలో భాగంగా ఆయన ఆదివారం (మార్చి 16) విజయ వాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్ప 3 సినిమా రిలీజ్ గురించి చెప్పాడు. అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు.
క్రేజీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే ఫహద్ ఫాజిల్, సునీల్, డాలి ధనంజయ, అజయ్ ఘోష్, జగదీశ్ ప్రతాప్, అనసూయ, రావు రమేష్ తదతరులు కీలక పాత్రలు పోషించారు. ఇక లేటెస్ట్ సెన్సేషణ్ శ్రీలీల ఒక ప్రత్యేక పాత్రలో సందడి చేసింది. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాలను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. కాగా పుష్ప 2కి సీక్వెల్ ఉంటుందని చిత్ రయూనిట్ ఎప్పుడో ప్రకటించింది. తాజాగా రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేయడంతో బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2 రిలీజ్ కు వంద రోజులు.. స్పెషల్ వీడియో..
100 DAYS FOR INDIAN CINEMA’S INDUSTRY HIT #Pushpa2TheRule ❤️🔥
From wildfire moments on the screen to record-breaking moments at the box office, #Pushpa2 has taken Indian Cinema to the next level 💥💥💥#100DaysofPushpa2TheRule#WildFirePushpa
Icon Star @alluarjun @iamRashmika… pic.twitter.com/Rpz3Ey8jxJ
— Pushpa (@PushpaMovie) March 14, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.