Drugs Case: నిర్మాత కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. ఆ హీరోయిన్లతో సహా మొత్తం 12 పేర్లు వెలుగులోకి..
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కబాలీ నిర్మాత కేపీ చౌదరి పోలీసుల విచారణ ముగిసింది. ఈ సందర్భంగా కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‌తో టాలీవుడ్ షేక్ అవుతోంది. టీవీ9 చేతిలో కేపీ చౌదరి డ్రగ్స్ కన్స్యూమర్ లిస్ట్ ఉంది. మొత్తం 2 రోజుల పాటు సాగిన విచారణలో

టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కబాలీ నిర్మాత కేపీ చౌదరి పోలీసుల విచారణ ముగిసింది. ఈ సందర్భంగా కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‌తో టాలీవుడ్ షేక్ అవుతోంది. టీవీ9 చేతిలో కేపీ చౌదరి డ్రగ్స్ కన్స్యూమర్ లిస్ట్ ఉంది. మొత్తం 2 రోజుల పాటు సాగిన విచారణలో 12 పేర్లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. తెలుగు బిగ్‌బాస్ ఒక సీజన్‌లో పాల్గొన్న హీరోయిన్‌తో పాటు తెలుగులో స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్‌తో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక విచారణలో భాగంగా కేపీ బ్యాంక్ లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలించారు. ఇందులో భాగంగా 11 అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారు. వీరితో పాటు రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేష్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ సహా మరికొన్ని పేర్లు కేపీ చౌదరి డ్రగ్స్ కన్స్యూమర్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు తాను సినిమా వాళ్లెవరికీ డ్రగ్స్ సప్లై చేయలేదని కేపీ చెప్పుకొచ్చారు. ఫోన్‌లో నెంబర్ ఉన్నంత మాత్రాన పెడ్లర్‌ని కాదన్నారు. ‘ నేను డ్రగ్స్ తీసుకుంటా.. ఆ డ్రగ్స్ నాకోసమే. సెలబ్రెటీలు ఎవరికీ నేను డ్రగ్స్ ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చాడు కేపీ చౌదరి. కాగా రజనీకాంత్ నటించిన కబాలి సినిమాను తెలుగులో ప్రొడ్యూస్ చేసిన కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. అతని ద్వారా సినీ డ్రగ్స్ లింక్స్‌ను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..