Karthi: హీరో కార్తీతో ఉన్న ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టరా ?.. స్టార్ కమెడియన్ అతను..
గతంలో కార్తీ సినిమా కోసం అమ్మాయి గెటప్ ధరించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో అతనితో దిగిన సెల్ఫీని తాజాగా కార్తీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అయితే మహిళా గెటప్‍లో ఉన్న ఆ వ్యక్తి ఎవరా ?.. అని సెర్చింగ్ చేస్తున్నారు. ఆ కమెడియన్ ఇప్పుడు హీరోగా మారాడు.
పైన ఫోటోను గమనించారా ?.. తమిళ్ స్టార్ హీరో కార్తీతోపాటు అమ్మాయి గెటప్ లో ఉన్న ఆ వ్యక్తి ఎవరో గుర్తుపట్టరా ?.. కోలీవుడ్ ఇండస్ట్రీలో అతను స్టార్ కమెడియన్. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే అతను గతంలో కార్తీ సినిమా కోసం అమ్మాయి గెటప్ ధరించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో అతనితో దిగిన సెల్ఫీని తాజాగా కార్తీ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ పిక్ ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. అయితే మహిళా గెటప్‍లో ఉన్న ఆ వ్యక్తి ఎవరా ?.. అని సెర్చింగ్ చేస్తున్నారు. ఆ కమెడియన్ ఇప్పుడు హీరోగా మారాడు. కథానాయకుడిగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ కమెడియన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎవరో గుర్తుపట్టరా ?.. తనే హాస్యనటుడు సంతాపం.
1980 జనవరి 21న జన్మించారు సంతానం. తెలుగులో బ్రహ్మానందం ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో అదే స్థాయిలో కోలీవుడ్ ఇండస్ట్రీలో సంతానం ఫేమస్. 2002లో సినీరంగంలోకి అడుగుపెట్టిన సంతానం.. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అక్కడ అందరూ స్టార్ హీరోస్ సినిమాల్లో నటించారు. తన మేనరిజమ్స్, కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాడు. ఇక 2013 నుంచి హీరోగా మారాడు సంతానం.
అటు కమెడియన్ గానే కాదు… హీరోగానూ సక్సెస్ అయ్యాడు సంతానం. ప్రస్తుతం అతను కిక్, డీడీ రిటర్న్స్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే పొన్నియర్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ.. ఇప్పుడు జపాన్ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే అడియన్స్ ముందుకు రానున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.