Prabhas: ప్రభాస్‏కు జపాన్ అమ్మాయి డై హార్డ్ ఫ్యాన్.. ‘ఆదిపురుష్’ కోసం టోక్యో నుంచి సింగపూర్‏కు..

ఇండియాలోనే కాకుండా..జపాన్ లోనూ ప్రభాస్ కు అత్యథికంగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఓ అమ్మాయి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా చేసేందుకు ఏకంగా టోక్యో నుంచి సింగపూర్ వరకు ప్రయాణం చేసిందట. దీంతో ఆమెకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Prabhas: ప్రభాస్‏కు జపాన్ అమ్మాయి డై హార్డ్ ఫ్యాన్.. 'ఆదిపురుష్' కోసం టోక్యో నుంచి సింగపూర్‏కు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 22, 2023 | 5:18 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రపంచవ్యాప్తంగా అత్యథిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. బాహుబలి సినిమాతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్స్.. నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించి సాహో, రాధేశ్యామ్ సినిమాలు డిజాస్టర్స్ కాగా.. ఇక ఇటీవల విడుదలైన ఆదిపురుష్ మూవీ మాత్రం మిశ్రమ టాక్ అందుకుంటుంది. ఓవైపు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. మరోవైపు భారీగా వసూళ్లు రాబడుతుంది. ఈసినిమాకు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ ఎక్కువగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కోసం టోక్యో నుంచి సింగపూర్ వచ్చింది ఓ మహిళా అభిమాని.

ఇండియాలోనే కాకుండా..జపాన్ లోనూ ప్రభాస్ కు అత్యథికంగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఓ అమ్మాయి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా చేసేందుకు ఏకంగా టోక్యో నుంచి సింగపూర్ వరకు ప్రయాణం చేసిందట. దీంతో ఆమెకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో ఆమె తెలుగులో మాట్లాడుతుండడం విశేషం.

ఇవి కూడా చదవండి

తాను ప్రభాస్ కోసం ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చానని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానానికి హద్దులు లేవంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ తొలిసారి రాముడి పాత్రలో నటించారు. ఇందులో కృతి సనన్ సీత పాత్రలో నటించగా.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.