ఏపీలో కేరళ తరహా టూరిజం.. లగ్జరీ బోట్లలో లాహిరి లాహిరి లాహిరిలో
ఏపీ పర్యాటకం కొత్తపుంతలు తొక్కుతోంది. కేరళ తరహా లగ్జరీ బోట్ క్రూయిజ్‌లు 2026 అక్టోబర్ నాటికి విజయవాడ బెర్మ్ పార్కు, సూర్యలంక బ్యాక్‌వాటర్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్ల సహకారంతో ఐదు అత్యాధునిక బోట్లను పర్యాటక శాఖ ప్రారంభించనుంది. ఇవి రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించి పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయి.
ఏపీలో పర్యాటక రంగం కొత్తపుంతలు తొక్కబోతుంది. సాంప్రదాయానికి తోడు అధునికతను జోడించేందుకు పర్యాటకశాఖ సిద్దమైంది. కేరళ తరహాలో లగ్జరీ బోట్లు షికారు చేయనున్నాయి. విజయవాడ బెర్మ్ పార్కు, సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్‌లో 2026 అక్టోబర్ నాటికి ఈ లగ్జరీ బోట్లు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకుల కోసం ఐదు అల్ట్రా లగ్జరీ బోట్లు నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లు ముందుకొచ్చారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు చోట్లా ఐదు జెట్టీలు నిర్మించడంతోపాటు బోట్లకు విద్యుత్తు సౌకర్యం సంస్థ కల్పించనుంది. ఐదు బోట్లకు సంబంధించిన డ్రాయింగ్‌లకు ‘ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ’ అనుమతులు ఆపరేటర్లు తీసుకుని బోట్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 2026 అక్టోబరు నాటికి బోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలో ఇప్పటికే ఈ తరహా సేవలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఏపీలో బెర్మ్ పార్కు నుంచి పవిత్ర సంగమం వరకు రెండు బోట్లు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి 20 కిలో మీటర్ల మేర సర్వే కూడా చేశారు. ఒక బోటులో ఐదు పడక గదులు, వంద మందికి సరిపడా కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. మరో బోటును 200 మంది డిన్నర్ చేసేందుకు వీలుగా డిజైన్ చేయనున్నారు. రాత్రుల్లో భవానీ ద్వీపం వద్ద బోట్లు నిలిపేలా అక్కడ జెట్టీ, విద్యుత్తు సదుపాయం కల్పించనున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్‌లో నాగరాజు కెనాల్ నుంచి నిజాంపట్నం వరకు మూడు బోట్లు ప్రైవేట్ సంస్థలు నడపనున్నాయి. ఒక బోటులో 9, మరో బోటులో 3, ఇంకో బోటులో 2 పడక గదులు ఉంటాయి. బ్యాక్ వాటర్‌లో దాదాపు 30 కిలో మీటర్ల మేర బోటులో ప్రయాణించొచ్చు. మార్గమధ్యంలో సుందరమైన ప్రాంతాలను కూడా గుర్తించారు. మరోవైపు విశాఖ తీరంలో రాజమహేంద్రవరం, కాకినాడలో గోదావరి నదిలో, నాగార్జునసాగర్‌లోనూ అల్ట్రా డీలక్స్ బోట్లు ప్రైవేట్ ఆపరేటర్లతో నడిపేలా పర్యాటకాభివృద్ధి సంస్థ ఫీజబులిటీ సర్వే చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆసక్తిగల సంస్థలను ఆహ్వానిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
ఎంత పెద్ద నేరం జరిగినా పోలీసులకి చెప్పరు !! ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం అమలు
12 ఏళ్లకు మించి బతకడన్నారు… కట్ చేస్తే.. వేలంలో ఆ క్రికెటర్ రూ.25 కోట్ల ధర పలికాడు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో…! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం.. నేరం జరిగినా పోలీసులకి చెప్పరు
తండ్రితో గొడవ పడి భారత్‌లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు

