వారి కోసమే కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తోందిః ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అస్సాం పర్యటన సందర్భంగా డిసెంబర్ 21న నమ్రప్ చేరుకున్నారు. అస్సాం వ్యాలీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్ అమ్మోనియా-యూరియా ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. వేడుక తర్వాత, ప్రధాని మోదీ మాట్లాడుతూ, "అస్సాం తోపాటు మొత్తం ఈశాన్య ప్రాంతాలకు శుభదినం. నమ్రప్, దిబ్రుగఢ్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న కల నిజమవుతోంది" అని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అస్సాం పర్యటన సందర్భంగా డిసెంబర్ 21న నమ్రప్ చేరుకున్నారు. అస్సాం వ్యాలీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్ అమ్మోనియా-యూరియా ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. వేడుక తర్వాత, ప్రధాని మోదీ మాట్లాడుతూ, “అస్సాం తోపాటు మొత్తం ఈశాన్య ప్రాంతాలకు శుభదినం. నమ్రప్, దిబ్రుగఢ్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న కల నిజమవుతోంది” అని అన్నారు.
ఈ ప్రాంతంలో పారిశ్రామిక పురోగతిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందని ప్రధాని మోదీ అన్నారు. దిబ్రూఘర్‌కు రాకముందు, ఆయన గౌహతిలో వెదురు ఉపయోగించి నిర్మించిన కొత్త విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించారు. అస్సాం అభివృద్ధిలో కొత్త వేగాన్ని చేరుకుందని, మీరు ఇప్పుడు అనుభవిస్తున్నది ప్రారంభం మాత్రమే అని ప్రధాని మోదీ తెలిపారు.
“ఈ ఆధునిక ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించడం రైతు సోదరులందరికీ ఎంతో ఉపయోగం. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో పరిశ్రమలు, కనెక్టివిటీ ఈ సహకారం అస్సాం కలలను నెరవేరుస్తోంది. యువత కొత్త కలలు కనేలా ప్రేరేపిస్తోంది” అని ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో దేశ రైతులు, ఆహార ప్రదాతలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. అందువల్ల, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఎన్డీయే ప్రభుత్వం పగలు, రాత్రి కృషి చేస్తోంది.
నమ్రప్‌లోని ఈ యూనిట్ వేలాది కొత్త ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్లాంట్ పని ప్రారంభించిన తర్వాత, చాలా మందికి ఇక్కడ శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయి. ఇంకా, ఈ ప్లాంట్‌తో సంబంధం ఉన్న అన్ని పనులు స్థానిక నివాసితులకు, ముఖ్యంగా యువతకు ఉపాధిని కల్పిస్తాయి. నేడు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తోంది. అస్సాం మాదిరిగానే, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోని అనేక ఎరువుల కర్మాగారాలు కూడా మూతపడ్డాయి. వాటిన్నింటి పునరుద్దరించేందుకు కృషీ చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
గతంలో రైతులు యూరియా కోసం లైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసేవారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ మరింత దిగజారించిన పరిస్థితులను మెరుగుపరచడానికి మన ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ఆయన అన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం విత్తనం నుండి మార్కెట్ వరకు రైతులకు అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రైతులు రుణాల కోసం ఇబ్బంది పడకుండా వ్యవసాయ పనులకు సంబంధించిన డబ్బును నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకు దాదాపు రూ. 4 లక్షల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ అయ్యాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ జాతి వ్యతిరేక ఆలోచనలను ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. వారు బంగ్లాదేశ్ చొరబాటుదారులను అస్సాం అడవులు, భూములలో స్థిరపరచాలని కోరుకుంటున్నారు. వారు తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు. వారు మీ గురించి పట్టించుకోరు. కాంగ్రెస్ పార్టీకి మీ గుర్తింపుతో ఎటువంటి సంబంధం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ వలసదారులను స్థిరపరిచిందని, వారిని రక్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అందువల్ల, కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తోందన్నారు. అసోం గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకోవడానికి బీజేపీ ఉక్కు కవచంలా అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. “కాంగ్రెస్ బుజ్జగింపు, ఓటు బ్యాంకు అనే ఈ విషం నుండి మనం అస్సాంను రక్షించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
#WATCH | Namrup, Assam | After performing the Bhoomi Pujan for the Ammonia-Urea Project of Assam Valley Fertiliser and Chemical Company Ltd, Prime Minister Narendra Modi says, "Today is a big day for Assam and the entire North-East. The dream that Namrup and Dibrugarh had been… pic.twitter.com/G9brwiD3SX
— ANI (@ANI) December 21, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




