AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

John Kokken: ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా? ఇతని భార్య తెలుగులో ఫేమస్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లో క్రేజ్ ఉన్న విలన్లలో ఇతను కూడా ఒకడు. రవితేజ డాన్ శీనుతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన ఈ నటుడు పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా మెప్పించాడు.

John Kokken: ఈ టాలీవుడ్ విలన్ గుర్తున్నాడా? ఇతని భార్య తెలుగులో ఫేమస్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
John Kokken
Basha Shek
|

Updated on: Nov 29, 2025 | 8:02 PM

Share

అనీష్ జాన్ కొక్కెన్.. ఈ పేరు చాలా మంది వినకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. టాలీవుడ్ ఫేమస్ విలన్ అని ఇట్టే పసిగడతారు. కేరళకు చెందినప్పటికీ జాన కొక్కెన్ ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించాడు. విలన్ గా, సహాయక నటుడిగా దాదాపు 40 కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశాడు జాన్. మాస్ మహారాజా రవితేజ నటించిన డాను శీన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు జాన్. ఆ తర్వాత తీన్ మార్, అధినాయకుడు, దరువు, ఎవడు, నేనొక్కడినే, బాహుబలి, సర్దార్ గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్, రాజా ది గ్రేట్, కేజీఎఫ్ ఛాప్టర్ 1,2, వెంకీ మామ, మహర్షి, తునివు, వీర సింహారెడ్డి, కెప్టెన్ మిల్లర్, మదగజరాజా తదితర సూపర్ హిట్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ముఖ్యంగా కోలీవుడ్ హీరో ఆర్య నటించిన సార్పట్ట సినిమాలో జాన్ కొక్కెన్ నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే జాన్ కొక్కెన్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ నటుడు రెండు సార్లు వివాహం చేసుకున్నాడు.

మొదట 2016లో ప్రముఖ నటి మీరా వాసుదేవన్ ను పెళ్లి చేసుకున్నాడు జాన్ కొక్కెన్. వీరిద్దరికి బాబు పుట్టాడు. అయితే మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరు విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత చాలా ఏళ్ల వరకు సింగిల్ గానే ఉన్నాడు జాన్. అయితే మళ్లీ ఒక టాలీవుడ్ నటితో ప్రేమలో పడ్డాడు. 2019లో ఆమెతో కలిసి మళ్లీ పీటలెక్కాడు. ఇప్పుడు ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. జాన్ రెండోసారి పెళ్లి చేసుకున్న నటి ఎవరో తెలుసా? పూజ రామచంద్రన్. పేరు చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ ‘స్వామి రారా’ సినిమాలో కర్లీ హెయిర్ తో హీరో నిఖిల్ గ్యాంగ్ లో ఒక అమ్మాయి క్యూట్ గా కనిపిస్తుంటుంది. మాయ మాటలు చెప్పి అందరినీ బురిడి కొట్టిస్తుంది. ఆ అమ్మాయినే జాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

భార్య బిడ్డలతో జాన్ కొక్కెన్..

View this post on Instagram

A post shared by John Kokken (@highonkokken)

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే..పూజకు కూడా ఇది రెండో వివాహమే. 2010లో ఆమె వీజే క్రెయిగ్‌ను వివాహం చేసుకుంది కానీ 2017 లో అతని నుంచ విడాకులు తీసుకుంది. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది పూజా. స్నేహితుడు, పిజ్జా, డి కంపెనీ, దోచెయ్, త్రిపుర, దళం, సిద్ధార్థ, ఇంతలో ఎన్నెన్ని వింతలో, వెంకీ మామా, కృష్ణార్జున యుద్ధం, పవర్ ప్లే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, రిపీట్, మై నేమ్ ఈజ్ శ్రుతి తదితర తెలుగు సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని బుల్లితెర ఆడియెన్స్ కు కూడా బాగా చేరువైంది.

View this post on Instagram

A post shared by John Kokken (@highonkokken)

కాగా జాన్ కొక్కెన్ తో పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది పూజా. అయితే ఆ మధ్యన విడుదలైన హత్య సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది పూజ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us