Child Artist: ఏమున్నాడ్రా బాబు.. హీరోగా సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్.. ఫోటోస్ చూస్తే షాక్ అవాల్సిందే..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం వెండితెరపై వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ స్టర్స్ ఒకప్పుడు బాలనటీనటులుగా అలరించినవారే. తాజాగా మరో బాలనటుడు సైతం హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇంతకీ ఈ కుర్రాడు ఇప్పుడేలా ఉన్నాడో చూశారా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, సౌందర్య, జగపతి బాబు వంటి స్టార్స్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించి తన అమాయకత్వం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిన్న వయసులోనే తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. అతడి పేరు ఆనంద్ హర్షవర్దన్. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కానీ జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి నటించిన ప్రియరాగాలు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఇందులో సౌందర్య కొడుకుగా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమా తర్వాత తెలుుగలో అనేక చిత్రాల్లో కనిపించారు.
వెంకటేశ్, మీనా జంటగా నటించిన సూర్యవంశం సినిమా గుర్తుందా.. ? ఇందులో వెంకీ కొడుకుగా కనిపించారు. ఇంతకీ ఆ కుర్రాడి గురించి తెలుసా.. ? ఆనంద్ హర్షవర్దన్.. ప్రముఖ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ పీబీ శ్రీనివాస్ మనవడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాలరామాయణం సినిమాలో వాల్కికీ, బాల హనుమాన్ పాత్రలు పోషించారు. అలాగే తెలుగుతోపాటు హిందీలో అనేక సినిమాల్లో నటించాడు. దాదాపు 25 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు ఆనంద్.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
ఆ తర్వాత చదువుల కోసం కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. ఇప్పుడు నటనపై ఆసక్తితో మరోసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం నిదురించు జహాపన సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తు సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఆనంద్ మంచి కటౌట్ తో హీరోగా కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..




