AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nee Sneham Movie: నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో దివంగత హీరో ఉదయ్ కిరణ్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాల్లో నటించి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్నారు. ఉదయ్ కిరణ్ నటించిన చిత్రాల్లో నీస్నేహం ఒకటి. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

Nee Sneham Movie: నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..
Nee Sneham Movie
Rajitha Chanti
|

Updated on: Dec 29, 2024 | 3:42 PM

Share

దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో నీస్నేహం ఒకటి. డైరెక్టర్ పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ సినిమాను సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎమ్ఎన్ రాజు నిర్మించగా.. 2002 నవంబర్ 1న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ కీలకపాత్ర పోషించగా.. ఎప్పటిలాగే తమ నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్. స్నేహం, ప్రేమ రెండూ విడదీయలేని బంధాలను కథాంశంగా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది.ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా కనిపించి తెలుగు వారికి దగ్గరయ్యాడు జతిన్. ఇందులో ఉదయ్ కిరణ్, జతిన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జతిన్.. ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు. ముంబైకి చెందిన జతిన్.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. అదే సమయంలో ప్రైవేట్ ఆల్బమ్స్, హిందీ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత తెలుగు, పంజాబీ చిత్రాల్లో నటించిన జతిన్.. ఆ తర్వాత నీస్నేహం సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండానే సినిమాలకు దూరమయ్యాడు.

సినిమాలకు దూరంగా ఉంటున్న జతిన్.. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. 2010లో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న జతిన్.. ఇప్పుడు భార్య, పిల్లలతో కలిసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. కొన్నాళ్లుగా కాలిఫోర్నియాలో ఉంటున్న జతిన్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటాడు. ఈ హీరో ఇప్పుడు వ్యాపారరంగంలో రాణిస్తున్నాడు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.