AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అయ్యో పాపం.. ఒకప్పుడు అజిత్‏తో సూపర్ హిట్ సినిమా.. ఇప్పుడు ఇలా.. ఈ నటుడిని గుర్తుపట్టారా..?

సినిమా.. ఒక మాయ ప్రపంచం.. వెండితెరపై నటీనటులుగా ఓ వెలుగు వెలగాలంటే అవకాశాలు రావడం చాలా కష్టం. ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తమకంటూ వచ్చిన గుర్తింపును కాపాడుకోవడం కూడా అంతే కష్టం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటుడు ప్రస్తుతం ఊహించని విధంగా లైఫ్ గడిపేస్తున్నారు. అతడు ఎవరంటే..

Tollywood: అయ్యో పాపం.. ఒకప్పుడు అజిత్‏తో సూపర్ హిట్ సినిమా.. ఇప్పుడు ఇలా.. ఈ నటుడిని గుర్తుపట్టారా..?
Savi Siddu
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2025 | 10:13 AM

Share

సినీరంగుల ప్రపంచంలో నటీనటులు గుర్తింపు కోసం ఎదురుచూసేవారు చాలా మంది ఉన్నారు. కొందరు వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా దూసుకుపోతుంటారు. మరికొందరు మాత్రం ఈ గ్లామర్ ప్రపంచం ఉచ్చులో చిక్కుకుపోతుంటారు. ఈ మాయ నగరంలో వచ్చిన గుర్తింపును కాపాడుకోవడం అంత సులభమేమి కాదు. స్టార్ హీరోహీరోయిన్స్ మాత్రమే కాదు.. సినిమాల్లో సహాయ పాత్రలలో నటించిన కొందరు జనాలకు మరింత దగ్గరవుతుంటారు. కానీ అదృష్టం సరిగ్గా ఉన్నంతవరకే ఏ స్టార్ డమ్ అయినా… గుర్తింపు అయినా. ఒక్కసారి పరిస్థితి మారితే జీవితాలు తలకిందులు అయిపోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం.. అదే పరిస్థితి. ఒకప్పుడు సౌత్, నార్త్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సల్మాన్, షారుఖ్, అక్షయ్ కుమార్, అజిత్ కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన అతడు ఇప్పుడు వాచ్ మెన్ ఉద్యోగం చేస్తున్నారు. రోజుకు 12 గంటలపాటు వాచ్ మెన్ గా పనిచేస్తూ జీవిస్తున్నారు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?

పైన ఫోటోను చూశారు.. కదా.. అతడిని గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు భారతీయ సినీపరిశ్రమలో పేరుపొందిన నటుడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అక్షయ్ కుమార్, అజిత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. అతడి పేరు సావి సిద్ధు. అజిత్ కుమార్ నటించిన ఆరంభం సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే అక్షయ్ కుమార్ తో పాటియాలా హౌస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ జీవనోపాధి కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడి స్వస్థలం లక్నో. మోడలింగ్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలే కోరికతే చండీగఢ్ చేరుకున్నాడు. ఆ తర్వాత తిరిగి వెళ్లి లా పూర్తి చేశాడు.

1995లో ధర్మేంద్ర-శత్రుఘ్న సిన్హా చిత్రం ‘తాకత్’ ద్వారా సావి సిద్ధు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే చిత్రంలో కమిషనల్ ఏఎస్ పాత్రను పోషించారు. అలాగే గులాల్, పాటియాలా హౌస్, డిడే, సౌతంకి చాలా వంటి చిత్రాల్లో నటించాడు. 2013లో అజిత్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన ‘ఆరంభం’ చిత్రంలో సావి సిద్ధు ఉగ్రవాద సంస్థ సభ్యుడి పాత్రను పోషించాడు. అతను చివరిగా ‘మస్కా’ (2020)లో నటించాడు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. తన భార్య, అత్త, తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ఒంటరిగా మారానని.. మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలతో కుంగిపోయానని.. అందుకే ఇప్పుడు వాచ్ మెన్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు సావి సిద్ధు.

Savi Sidu Life

Savi Sidu Life

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..