Tollywood : హేయ్..! సీతమ్మ వాకిట్లో పాప ఇది నువ్వేనా..?మళ్ళీ ఇన్నేళ్లకు ఇలా

నిన్న మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసిన చాలా మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా మారి వరుసగా సినిమాలు చేస్తున్నారు. తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్, ఆకాష్ పూరి ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది ఉన్నారు. అలాగే మరికొంతమంది సోషల్ మీడియాతో బిజీగా గడిపేస్తున్నారు.

Tollywood : హేయ్..! సీతమ్మ వాకిట్లో పాప ఇది నువ్వేనా..?మళ్ళీ ఇన్నేళ్లకు  ఇలా
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 20, 2024 | 7:33 PM

చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా మారిపోయారు. మరికొంతమంది చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నిన్న మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసిన చాలా మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా మారి వరుసగా సినిమాలు చేస్తున్నారు. తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్, ఆకాష్ పూరి ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మంది ఉన్నారు. అలాగే మరికొంతమంది సోషల్ మీడియాతో బిజీగా గడిపేస్తున్నారు. ఇక ఇప్పుడు ఓ చైల్డ్ ఆర్టిస్ట్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించింది ఆ చిన్నది.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా.?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు చిన్నోడిగా, వెంకటేష్ పెద్దోడిగా నటించిన సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. సమంత , అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఏంటి ఇంకా కూలెక్కలేదా వాటరు అంటూ గోదావరి భాషలో మాట్లాడే చిన్నారి గుర్తుందా.? ఆమె పేరు రచన. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్లు సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ అమ్మాయికి మామయ్య వరుస అవుతారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Meera Jasmine: అచ్చం మీరాజాస్మిన్‌లా ఉండే మరో నటి.. ఆమె ఎవరో తెలుసా..?

ఇటీవల రీల్స్ లో ఈ డైలాగ్ మళ్ళీ ఫేమస్ అవ్వడంతో ఆ అమ్మాయి గురించి అందరికి తెలిసి పాపులర్ అయింది. రచన సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకొని పాపతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రచన రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె ఎలా ఉందో చూడటానికి సోషల్ మీడియాను తెగ గాలిస్తున్నారు. దాంతో ఈ చిన్నదాని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: పెద్ద ప్లానే ఇది..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరోసారి ఆ హాట్ బ్యూటీ.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.