అమితాబ్ చేతులమీదుగా చిరంజీవికి ఎఎన్ఆర్ అవార్డు : నాగార్జున
మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ఇవ్వనున్నాం అని అక్కినేని నాగార్జున అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. అక్టోబర్ 28న చిరంజీవికి అక్కినేని అవార్డు ప్రదానం చేస్తామన్నారు. అలాగే ఈ అవార్డు వేడుకకు ముఖ్య అతిథిగా అమితాబచ్చన్ రానున్నారని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ఇవ్వనున్నాం అని అక్కినేని నాగార్జున అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. అక్టోబర్ 28న చిరంజీవికి అక్కినేని అవార్డు ప్రదానం చేస్తామన్నారు. అలాగే ఈ అవార్డు వేడుకకు ముఖ్య అతిథిగా అమితాబచ్చన్ రానున్నారని తెలిపారు. అక్టోబర్ 28 న అమితాబ్ గారి చేతుల మీదుగా ప్రధానం చేయనున్నామని నాగ్ ప్రకటించారు. అవార్డు గురించి చిరంజీవికి చెప్పగానే కౌగిలించుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారని నాగ్ అన్నారు. దీనికన్నా పెద్ద అవార్డు నాకు లేదు అని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు అని నాగార్జున అన్నారు.