TOP 9 ET: ఏది మాట్లాడినా.. తిప్పలు తప్పడం లేదుగా.! జానీ మాస్టర్ నేరం ఒప్పుకున్నాడా?

TOP 9 ET: ఏది మాట్లాడినా.. తిప్పలు తప్పడం లేదుగా.! జానీ మాస్టర్ నేరం ఒప్పుకున్నాడా?

Anil kumar poka

|

Updated on: Sep 23, 2024 | 10:59 AM

జానీ మాస్టర్ నేరం చేశారా? తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను పలుమార్లు బెదిరించి లైంగిక దాడి చేశారా? అంటే అవునని అన్సర్ వచ్చేలా ఉన్న జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌ టీవీ9 చేతికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ రిపోర్ట్‌... జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. దురుద్దేశంతోనే జానీ మాస్టర్.. బాధితురాలని అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని.. పోలీసులు క్లారిటీకి వచ్చినట్టు సమాచారం.

01.Johnny: నేరం ఒప్పుకున్నాడా.? షాకింగ్‌గా జానీ మాస్టర్ రిమాండ్‌ రిపోర్ట్‌..

జానీ మాస్టర్ నేరం చేశారా? తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను పలుమార్లు బెదిరించి లైంగిక దాడి చేశారా? అంటే అవునని అన్సర్ వచ్చేలా ఉన్న జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్‌ టీవీ9 చేతికి వచ్చింది. అకార్డింగ్ టూ ఆ రిపోర్ట్‌… జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. దురుద్దేశంతోనే జానీ మాస్టర్.. బాధితురాలని అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని.. పోలీసులు క్లారిటీకి వచ్చినట్టు సమాచారం.

02. Johnny: నోరు అదుపులో పెట్టుకుంటే.. ఇప్పుడీ రచ్చ ఉండేది కాదుగా.!

ఇప్పుడే కాదు.. ఎప్పుడూ.. నోటిని అదుపులోనే పెట్టుకోవాలి. అది చేతకాలేదో.. ఇదిగో జానీ మాస్టర్లా నెట్టింట విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇక స్టార్ కొరియోగ్రాఫర్ కాకముందు.. బర్నింగ్ కొరియోగ్రాఫర్‌గా.. టీవీ షోల్లో డ్యాన్స్ మాస్టర్‌గా రాణిస్తున్న జానీ మాస్టర్.. ఓ లేడీ కొరియోగ్రాఫర్ అందం గురించి.. కాస్త అతిగా మాట్లాడారు. ఆమెను పటాయించడానికి ట్రై చేశా అంటూ.. ఓ ఇంటర్వ్యూలో బాహాటంగా చెప్పాడు. ఆమెను తన టీంలోకి తీసుకోవాలని అనుకున్నా అంటూ.. కాస్త సిగ్గుపడుతూ రిలీజ్ చేశాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బయటికి వచ్చి వైరల్ అవుతోంది. జానీ పై ఉన్న లైంగిక ఆరోపణల కేసుకు దీటుగా.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

03.pawn: గుడ్ న్యూస్ మరో 3 రోజుల్లో పవన్‌ సినిమా షూటింగ్ రీ- స్టార్.!

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. హరి హర టీం నుంచి బయటికి వచ్చిన అప్డేట్‌తో సంబరాలు షురూ చేశారు. సెప్టెంబర్ 23 నుంచి అంటే ఇంకో మూడు రోజుల్లోనే..  పవన్ హరిహర వీర మల్లు షూటింగ్‌ విజయవాడలోని ఓ సెట్లో ప్రారంభం కానుందనే అఫీషియల్ న్యూస్ మేకర్స్ నుంచి వచ్చింది. దాంతో పాటే.. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం అండ్ అతని కొడుకు, ఈ మూవీ నయా  డైరెక్టర్ జ్యోతి కృష్ణ.. పవన్‌తో దిగిన ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

04.koratala: ఏది మాట్లాడినా.. తిప్పలు తప్పడం లేదుగా.!

ఓ సెలబ్రిటీ.. ఓ మాట మాట్లాడితే..! దాని వెనకా ముందూ.. ఏం లేకుండా కట్ చేసి..! మనం మాట్లాడిన దాన్ని వేరే విధంగా పోట్రే చేయడం ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కవవుతోంది. ఇప్పుడు కొరటాల శివ విషయంలోనూ ఇలానే జరిగింది. దేవర మూవీ ప్రమోషన్ కోసం విశ్వక్, సిద్దుతో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ  ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలోనే తనకున్న బిగ్గెస్ట్ ఫియర్ గురించి మాట్లాడారు కొరటాల. అకౌంటబులిటీ అంటేనే తన దృష్టిలో భయమని చెప్పాడు. అది వివరించే క్రమంలోనే పక్కోడి పనిలో చెయ్యి పెట్టి.. ఎదుటోళ్లని ఇబ్బంది పెట్టి.. అంటూ మాట్టాడాడు. అయితే కొరటాల మాట్లాడిన ఈ మాటలను ఆచార్య ప్లాప్‌తో ముడిపెట్టి.. కొంత మంది నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇక ఇది గమనించిన దేవర ఫ్యాన్స్‌.. ఏది మాట్లాడినా.. కొరటాలకు తిప్పలు తప్పడం లేదుగా అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

05.C kalayan: జానీ మాస్టర్ కేసు.. సినీ నిర్మాత సంచలన కామెంట్స్.

జానీ మాస్టర్ కేసుపై సీనీ నిర్మాత సీ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. జానీ మాస్టర్ వివాదం వెనుక  పెద్ద కుట్ర కోణం ఉందన్నారు. జానీ మాస్టర్ లాంటి ఇండస్ట్రీలో మంచి హోదా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు వస్తే.. మొదట అతడిపై ఇండస్ట్రీలో ఫిర్యాదు నమోదు చేయాలని.. ఇక్కడ న్యాయం జరగకపోతే పోలీసుల వరకు వెళ్లాలని చెప్పారు.  అలా కాక పోలీసులు ముందుకు వెళ్లడంతో.. ఏవేవో వదంతులు వ్యాప్తిస్తున్నాయని..అది ఇద్దరికీ మంచిది కాదన్నట్టు మాట్లాడారు. అంతేకాదు ఈ కేసుకు పోక్సో కేసు ఎలా వర్తిస్తుందంటూ ప్రశ్నించారు. జానీ మాస్టర్ చేసింది.. లవ్ జిహాదీనే అంటూ.. కొంత మంది కామెంట్స్ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు ఈ స్టార్ ప్రొడ్యూసర్.

06.Devara: దేవర కోసం.. రంగంలోకి ముగ్గురు టాప్ డైరెక్టర్లు.!

ఇప్పటికే ప్రమోషన్స్ ను పరిగెత్తిస్తున్న దేవర.. సెప్టెంబర్ 22న హైద్రాబాద్లో జరిగే.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో.. తన ప్రచార పర్వానికి ఎండ్ కార్డ్ వేయనున్నాడు. ఇక అందుకే అన్నట్టు.. తెలుగు టూ స్టేట్స్‌లో మోగిపోవాలన్నట్టు.. తన సినిమా ప్రమోషన్స్‌ కోసం ముగ్గురు పాన్ ఇండియా డైరెక్టర్లను రంగంలోకి దింపుతున్నారట NTR. రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్‌ నీల్‌ను.. దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌లుగా ఇన్‌వైట్ చేశారట.

07.RGV: మ్యూజిక్ డైరెక్టర్లకు షాకిచ్చిన RGV AI తో ‘సారీ’ సినిమాకు సాంగ్స్.

ఎప్పుడూ తన ట్వీట్లతోనే అందరికీ షాకిచ్చే ఆర్జీవీ.. ఇప్పుడు AI సాయంతో.. టాలీవుడ్‌ మ్యూజిక్ డైరెక్టర్లకు ట్విస్ట్ ఇచ్చారు. అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ ను ఉపయోగించి ఏకంగా.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ సారీ సినిమాకు మ్యూజిక్ కంపోజ్‌ చేసేశారు. ఈ సినిమాలోని BGM, సాంగ్స్ అన్నింటినీ.. AIతోనే క్రియట్ చేశాడు. ఇప్పుడా సాంగ్స్‌ ను ఒక్కొక్కటిగా.. యూట్యూబ్లో కూడా రిలీజ్‌ చేస్తూ.. యూట్యూబ్‌లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు ఈయన.

08.NTR: కొంచెం గ్యాప్ ఇయ్యరాదే అన్నా.. మరీ ఇంత తొందర్నా.?

గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు తీయడంలో.. స్టార్ట్ చేయడంలో.. ప్రభాస్‌ దిట్ట. అయితే ఇప్పుడు ప్రభాస్‌నే బీట్ చేసేలా.. ప్లాన్ చేసుకున్నారు ఎన్టీఆర్. దేవర సినిమా షూటింగ్ అలా ముగిసిందో లేదో.. ఇలా ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్లో తను చేయబోయే సినిమాను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు తారక్.  వచ్చే నెల అంటే అక్టోబర్ 21 నుంచి తన మోస్ట్ అవేటెడ్ మూవీ డ్రాగన్ ను మొదలెట్టనున్నాడు. దీంతో తారక్ స్పీడ్ చూసిన ఆయన ఫ్యాన్స్ జరగ్యాప్ ఇయ్యరాదే అన్నా అంటూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

09.prabhas: చిన్నా.. పెద్దా.. ప్రొడ్యూసర్లకు అందని ద్రాక్షలా ప్రభాస్‌.!

చిన్నా.. పెద్దా ప్రొడ్యూసర్లకు ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారింది. డార్లింగ్ వరుసగా చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు.. టాక్‌తో సంబంధం లేకుండా.. కోట్లకు కోట్లు కొల్లగొడుతుండడంతో.. ప్రభాస్‌ తన అప్‌కమింగ్ సినిమా బడ్జెట్‌ను  ఆయా దర్శకులు పెంచే ఆలోచన చేస్తున్నారట. ఇప్పుటికే సందీప్ రెడ్డి వంగా… ప్రభాస్‌తో తాను చేస్తున్న స్పిరిట్‌ సినిమా బడ్జెట్‌ను 300 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచారట. దీంతో మెగా ప్రొడ్యూసర్స్.. పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ తప్పితే.. చిన్నా,పెద్దా ప్రొడ్యూసర్లకు మన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అందని ద్రాక్షలానే మారుతున్నారనే టాక్ వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Sep 21, 2024 11:58 AM