Bigg Boss 8: పెద్ద ప్లానే ఇది..! బిగ్ బాస్ హౌస్‌లోకి మరోసారి ఆ హాట్ బ్యూటీ..
ఈవారం హౌస్ నుంచి ఎవరి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గత వారం ఎవరు ఊహించని విధంగా శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఇక ఈ వారం.. యష్మీ గౌడ, పృథ్వీ, ప్రేరణ, నైనిక, మణికంఠ, విష్ణుప్రియ, సీత, అభయ్, నామినేషన్స్ లో ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్ మేట్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరినీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఇక హౌస్ లో ఉన్న వారికీ రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈవారం హౌస్ నుంచి ఎవరి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గత వారం ఎవరు ఊహించని విధంగా శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఇక ఈ వారం.. యష్మీ గౌడ, పృథ్వీ, ప్రేరణ, నైనిక, మణికంఠ, విష్ణుప్రియ, సీత, అభయ్, నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ జనాలకు పెద్దగా తెలియక పోవడంతో పెద్దగా ఇంట్రెస్ట్ రావడం లేదు. గత సీజన్ తో పోల్చితే చాలా మంది ప్రేక్షకులకు తెలియని మొఖాలు ఉన్నాయి హౌస్ లో..
ఇది కూడా చదవండి : Prabhas : 25 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి ప్రభాస్ కోసం తెలుగులోకి.. ఆమె ఎవరు.? ఏ సినిమా కోసం అంటే
ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ ను తీసుకురానున్నారని తెలుస్తోంది. టీఆర్పీలో దూసుకుపోవడానికి కొత్త ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ నుంచి కొంతమందిని ఇప్పుడు సీజన్ 8లోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు హౌస్ లోకి ఓ హాట్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి :డీ గ్లామర్ లుక్‌లో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె..
గత సీజన్ లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా బ్యూటీ నయని పావని. బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ అమ్మడు కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఒకే ఒక్క వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. దాంతో ఇప్పుడు మరోసారి నయనిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా నయని విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడికి ఇన్ స్టాలో దగ్గరదగ్గర 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఇప్పుడు నయనిని మరోసారి హౌస్ లోకి దింపనున్నారని తెలుస్తోంది. ఇక ఆమె ఫ్యాన్స్ కూడా నయని హౌస్ లోకి రావాలని కోరుకుంటున్నారు. మరి నిజంగా నయని పావని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
ఇది కూడా చదవండి : Tollywood : రోడ్డు పై డాన్స్‌తో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శబాష్ అనాల్సిందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.