AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇమేజ్ వల్ల బొమ్మరిల్లు సినిమా వదులుకొని బాదపడ్డ స్టార్ హీరో.. ఆయన చేసుంటే..

ఈ సినిమా తర్వాత జెనీలియా పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో ఆమె పేరు హాసిని. చాలా రోజులు ప్రేక్షకులు జెనీలియాని ఇదే పేరుతో పిలిచారు. అంతే కాదు కుర్రాళ్లు తమ లవర్ కు హాసిని అనే పేరు పెట్టుకున్నారు కూడా.. బొమ్మరిల్లు సినిమాలో లవ్ అండ్ ఎమోషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి.

ఇమేజ్ వల్ల బొమ్మరిల్లు సినిమా వదులుకొని బాదపడ్డ స్టార్ హీరో.. ఆయన చేసుంటే..
Bommarillu
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2024 | 5:29 PM

Share

తెలుగు సినిమాల్లో కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన సినిమా బొమ్మరిల్లు . సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత జెనీలియా పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో ఆమె పేరు హాసిని. చాలా రోజులు ప్రేక్షకులు జెనీలియాని ఇదే పేరుతో పిలిచారు. అంతే కాదు కుర్రాళ్లు తమ లవర్ కు హాసిని అనే పేరు పెట్టుకున్నారు కూడా.. బొమ్మరిల్లు సినిమాలో లవ్ అండ్ ఎమోషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమా చూస్తే మంచి ఫీల్ వస్తుంది. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తన నటనతో ఆకట్టుకున్నారు.

ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!

ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవ్వనుంది. 2007లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సెప్టెంబర్ 21మన మరోసారి థియేటర్స్‌లో సందడి చేయండని రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే బొమ్మరిల్లు సినిమాను ముందుగా ఓ స్టార్ హీరో చేయాలిసిందట కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ కథ సిద్దార్థ్ దగ్గరకు వెళ్ళింది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయనే యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బొమ్మరిల్లు కథ నాకు బాగా నచ్చింది.  నా ఇమేజ్ వల్ల ఓ సినిమా హిట్ అవ్వకపోయిన పర్లేదు.. కానీ నా ఇమేజ్ వల్ల ఆ సినిమాకు రావాల్సిన ఇంపార్టెన్స్ తగ్గిపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. దిల్ రాజు వచ్చి నాకు బొమ్మరిల్లు కథ చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. అయ్యో ఈ సినిమా మిస్ అయిపోతుందే అని బాధపడ్డాను. నాకు బాగా నచ్చిన కథ అది. నా ఇమేజ్ ఆ సినిమాకు న్యాయం చేయదు. అందుకే ఆ సినిమాను వదులుకున్నాను అని ఎన్టీఆర్ అన్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సెప్టెంబర్ 27 ఈ సినిమా రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో జాన్వికపూర్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?
నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?