Tollywood: సినిమాలు మానేసి దైవ చింతనలో టాలీవుడ్ అందాల తార.. గుర్తుపట్టలేకుండా మారిపోయిందిగా.. లేటెస్ట్ ఫొటోస్ చూస్తే షాక్
ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ పలు తెలుగు,తమిళ్, హిందీ, మలయాళ సినిమాల్లో నటించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.. స్పెషల్ సాంగ్స్ తో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. అయితే ఇప్పుడు అదంతా గతం.

ముంతాజ్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టలేకపోవచ్చు.. కానీ.. పవన్ కల్యాణ్ నటించిన ఖుషిలోని గుండె ఝల్లు మన్నాదిరో, అత్తారింటికి దారేదిలోని ఇట్స్ టైమ్ టు పార్టీ సాంగ్స్ నటి అంటే ఇట్టే గుర్తు పడతారు. ఈ రెండు సాంగ్స్ లో తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో తెలుగు ఆడియెన్స్ ను ఉర్రూతలూగించిందీ అందాల తార. ఈ రెండు సినిమాల్లోనే కాదు చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, బడ్జెట్ పద్మనాభం, జెమిని, కూలి, కొండవీటి సింహాసనం, ఆగడు, రాజాధి రాజా తదితర సినిమాల్లో సహాయక నటి పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది. అలాగే కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తమిళ్ రెండవ సీజన్‌లో ఒక కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. అయితే తన సినిమా కెరీర్ లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ కే పరిమితమైందీ అందాల తార. ఈ నటి చేసిన పాటలన్నీ ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కాగా ఉన్నట్లుండి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ముంతాజ్. చివరిగా 2015లో టామీ అనే సినిమాలో కనిపించిన ఆమె ఆ తర్వాత మరెక్కడా కనిపించలేదు. సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన ముంతాజ్ ఇప్పుడు దైవ చింతనలో లీనమైపోయింది. పలు సార్లు మక్కా యాత్రకు కూడా వెళ్లొచ్చింది.
కాగా ఆ మధ్యన ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూకు హాజరైంది ముంతాజ్. సినిమాలకు దూరం కావడానికి గల కారణాన్ని అందులో వివరించిందీ అందాల తార. ‘నేను ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాను. ఖురాన్ కూడా చదివాను. అయితే మొదట్లో ఖురాన్‌లో పేర్కొన్న విషయాలను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఆ తర్వాత మెల్లిగా దాని అంతరార్థం నాకు అర్థమైంది. క్రమంగా నాలో మార్పు వచ్చింది. అందుకే సినిమాలను విడిచి పెట్టేశాను’ అని ముంతాజ్ పేర్కొంది.
ముంతాజ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
సినిమాలకు దూరంగా ఉంటోన్న ముంతాజ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. తరచూ తన ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అయితే ఈ ఫొటోల్లోనూ హిజాబ్ తో కనిపిస్తోంది ముంతాజ్. వీటిని చూసి సినీ అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు.
మక్కా యాత్రలో ముంతాజ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.