Amrutha Movie: ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని ఊపేసింది.. అమృతా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
Amrutha Telugu Movie: చైల్ట్ ఆర్టిస్టుగా సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని ఊపేసింది. అమాయకంగా కనిపిస్తూనే అద్భుతమైన నటనతో మెప్పించింది. కానీ ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. అమృతా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ?

సినీరంగంలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నవారిలో కీర్తన ఒకరు. ఈ పేరు చెబితే తెలుగు అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు. కానీ సూపర్ హిట్ అమృతా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమా పేరు చెప్పగానే అమాయకమైన అల్లరి పిల్ల మన ముందుకు వస్తుంది. ఆమె రూపం అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన సూపర్ హిట్ చిత్రాల్లో అమృతా ఒకటి. 2002లో విడుదలైన ఈ ఫీల్ గుడ్ సినిమాలో హీరో మాధవన్, సిమ్రాన్ జంటగా నటించారు. అప్పట్లో ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. ఈసినిమా కథ మొత్తం ఓ చిన్నారి చుట్టూ తిరుగుతుంది. తనే కీర్తన. ఈ మూవీతోనే ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.
కీర్తన మరెవరో కాదు.. డైరెక్టర్ పార్తీబన్, నటి సీతల కుమార్తె. ముఖ్యంగా నటి సీత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ ప్రారంభంలో అనేక సినిమాల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత సహయ నటిగా కనిపించింది. తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులు కావడంతో చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. అమృతా సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైంది. తన తల్లిదండ్రులను కలుసుకోవాలనే ఓ చిన్నారి పడే ఆరాటం, పోరాటం ఆధారంగా ఈ మూవీని తెరెక్కించారు.
ఈ సినిమాతో ఎన్నో అవార్డ్స్ అందుకున్న కీర్తన.. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేస్తుందని అనుకున్నారు. కానీ అలా కాకుండా అమృతా సినిమా తర్వాత మరోసినిమా చేయలేదు. చదువుల కోసం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కీర్తన.. పెళ్లిచేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్. కీర్తన అక్కినేని వారింటి పెద్ద కోడలు. కానీ నాగేశ్వరరావు, నాగార్జున అక్కినేని ఫ్యామిలీ కాదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ అక్కినేని. శ్రీకర్ తండ్రి అక్కినేని సంజీవి తెలుగులో అనేక సినిమాలను నిర్మించారు. ఇక కీర్తన భర్త అక్షయ్ హిందీలో పలు చిత్రాలను తెరకెక్కించారు.

Child Artist

Keerthana
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..




