అప్పుడు టాప్ హీరోయిన్.. ఇప్పుడు గ్లామర్ డాల్..! సెకండ్ ఇన్నింగ్స్ కూడా కలిసిరాలేదు
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార. దక్షిణాది చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో ఈ అమ్మడు నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అయితే సినిమాల్లో హీరోయిన్ గా చేసే సమయంలో చాలా పద్దతిగా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు మారిపోయింది. గ్లామర్ డోస్ పెంచేసింది.. ఈ ముద్దుగుమ్మ గ్లామర్ ట్రీట్ చూసి అందరు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. అప్పటికి ఇప్పటికీ ఈ చిన్నది అంతే అందంగా ఉంది.
నెట్టింట గ్లామర్ షోతో అదరగొడుతుంది. అయినా లాభం లేకుండా పోయింది. ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా ..? ఆమె మీరాజాస్మిన్. ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ చిన్నది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ. సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించి మెప్పించింది. కానీ ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
ఇక ఇప్పుడు మీరా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో రీసెంట్ గా స్వాగ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ప్రస్తుతం మీరా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఆ మధ్య విమానం అనే సినిమా చేసింది. ఆ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన స్వాగ్ సినిమాలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో ఈ భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








