ఎలా మిస్ చేసుకున్నారు గురూ.!! కొత్తబంగారు లోకం సినిమాను వదులుకున్న హీరోలు వీళ్లే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘కొత్త బంగారు లోకం’. 2008లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం యూత్‌కు తెగ నచ్చేసింది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ హీరో వరుణ్ సందేశ్, శ్వేత బసు ప్రసాద్ జంటగా నటించారు.

టాలీవుడ్‌లో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా కొత్తబంగారు లోకం. 2008లో విడుదలైన కొత్త బంగారు లోకం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించి మెప్పించారు. ఇందులో ప్రకాష్ రాజ్, రావు రమేశ్, జయసుధ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా కథ… సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాలేజ్ లవ్ స్టోరీని తెరకెక్కించిన తీరుకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ డైలాగ్స్ అప్పట్లో ఎంతగా ఫేమస్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ఎ.. క.. డ ?.. అంటూ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఇక ఈ సినిమాతో హీరో వరుణ్ తేజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ ఆ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేకపోయాడు. చేసిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాను మిస్ అయిన హీరోలెవరో తెలుసా..? కొత్త బంగారు లోకం సినిమా కోసం కొత్త నటుడు కావాలనుకున్నారట డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలుసుకున్న శ్రీకాంత్.. నాగార్జునను సంప్రదించారట. కథ విన్న నాగార్జున యాక్షన్ నేపథ్యం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇక అదే స్టోరీతో రామ్ పోతినేని దగ్గరకు వెళ్లారట. అయితే హీరోది ఇంటర్ స్టూడెంట్ రోల్ కావడంతో అది తనకు సెట్ కాదని నో చెప్పారట రామ్.
అదే సమయంలో మరో హీరో కోసం వెతుకుతుండగా.. హ్యాపీ డేస్ సినిమాతో పాపులర్ అయిన వరుణ్ సందేశ్ బాగున్నాడని ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ సలహా ఇచ్చారట. దీంతో హ్యాపీడేస్ చూసిన శ్రీకాంత్, నిర్మాత దిల్ రాజ్ వరుణ్ సందేశ్ ను తమ ప్రాజెక్టులోకి తీసుకున్నారట. అలా చైతూ, రామ్ మిస్ చేసుకున్న ఈ ప్రాజెక్టులోకి వరుణ్ చేరి సూపర్ హిట్ అందుకున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








