పండగంటే బిర్యానీ, పటాకులు ఉండాల్సిందే.. నా లైఫ్‌లో వెలుగులు నింపింది అతనేనంటున్న హీరోయిన్
సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఘనంగా దీపావళి జరుపుకుంటున్నారు. సినీ సెలబ్రెటీలు తమ అభిమానులకు సోషల్ మీడియాలో విషెస్ తెలుపుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ దీపావళి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీపావళి పండగ అంటే బిర్యానీ, పటాకులు ఉండాల్సిందే అని చెప్పింది. ఆ అమ్మడు.

దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుంటున్నారు. ప్రతి ఏడాదికంటే ఈ ఏడాది ప్రేక్షకులు దీపావళి పండగను మరింత ఘనంగా జరుపుకుంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఘనంగా జరుపుంటున్నారు. సెలబ్రెటీలు ప్రేక్షకులకు విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు ఘనంగా జరుపుకుంటూ అభిమానులకు అభినందనలు తెలుపుతున్నారు. ఓ హీరోయిన్ తన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి ఆయనే.. అంటూ ప్రశంసలు కురిపించింది. అలాగే పటాకులు.. బిర్యానీ, ఈ రెండూ ఉంటేనే పండగ అంటూ చెప్పుకొచ్చింది ఆ అమ్మడు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఆమె ఎవరో కాదు తమిళ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్..లేడీ విలన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది ఈ బ్యూటీ. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మాస్ లుక్‌లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మీ. ఈ సినిమాతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








