Renu Desai: ‘దయచేసి ఆ ఒక్క పని చేయకండి’.. దీపావళి పండగ వేళ రేణూ దేశాయ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ వైరల్
సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. తాజాగా దీపావళి పండగను పురస్కరించుకుని రేణూ దేశాయ్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

దేశమంతా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పర్వదినాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులు కూడా తమ ఇళ్లల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి రేణు దేశాయ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ పండగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆకాంక్షించింది. అదే సమయంలో ఒక రిక్వెస్ట్ కూడా చేసింది. ‘మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇది అందరూ సంతోషంగా పండుగ జరుపుకునే సమయమని నాకు కూడా తెలుసు. అయితే రాత్రి 9 గంటల తర్వాత చాలా ఎక్కువగా శబ్ధం వచ్చే క్రాకర్లు పేల్చకండి. ఎందుకంటే చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు, మూగజీవాలు ఆ విపరీతమైన శబ్దాలకు భయపడే అవకాశముంది. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్‌తో దీపావళి పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి’ అని విజ్ఞప్తి చేసింది రేణూ దేశాయ్.
ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘చాలా మంచి విషయం చెప్పారు మేడమ్’ అంటూ నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. కాగా రేణూ దేశాయ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది. 2023 లో టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ మరో సినిమాలో నటించలేదీ అందాల తార. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటోంది మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పట్ల తన గళాన్ని వినిపిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ (NGO)ను కూడా ప్రారంభించింది రేణూ దేశాయ్.
దీపావళ వేళ రేణూ దేశాయ్ పోస్ట్ ఇదిగో..
View this post on Instagram
ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే రేణు పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంటుది. ఇటీవలే రేబీస్ టీకాను కూడా వేయించుకుని ఆ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిందీ అందాల తార. తద్వారా అందరికీ దీనిపై అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది.
రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటోన్న నటి రేణూ దేశాయ్.. వీడియో ఇదిగో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




