నలుగురితో ఎఫైర్ పెట్టుకున్నా.. కానీ ఇప్పటికీ నేను సింగిలే..! హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్.. ఇలా ఇండస్ట్రీ ఏదైనా కూడా నటీనటుల వ్యక్తిగత జీవితాల్లో ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి వ్యవహారాలు సర్వసాధారణం. ఈ విషయాలపై ఈ మధ్యకాలంలో చాలామంది నటులు, నటీమణులు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఓ హీరోయిన్ ఏకంగా నలుగురితో ఎఫైర్ పెట్టుకున్నా అని చెప్పి షాక్ ఇచ్చింది.

సినిప్రపంచం అనేది రంగులతో నిండివుంది.. చాలా మంది ఈ రంగుల ప్రపంచంలో తమను తాము నిరూపించుకుంటూ రాణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, ప్రేమలు, విడాకులు అనేవి చాలా కామన్ అయ్యాయి. ఈ మధ్య హీరో, హీరోయిన్స్ ఎఫైర్స్, పెళ్లిళ్లు, విడాకులు తెగ వినిపిస్తున్నాయి. ఇక ఎఫైర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. కొంతమంది రెండు మూడు ఎఫైర్స్ కూడా పెట్టుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో ఓ అందాల భామ తన ఎఫైర్స్ గురించి ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చింది. తాను నలుగురితో ప్రేమాయణం నడిపాను అని చెప్పింది అందరూ అవాక్ అయ్యేలా చేసింది. అయితే నలుగురితో ప్రేమాయణం నడిపినా.. కూడా ఒక్కరు కనెక్ట్ కాలేదు అని చెప్పింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఇండస్ట్రీలో నలుగురితో ప్రేమలో పడ్డాను అని చెప్పిన హీరోయిన్ ఎవరో కాదు హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు ఈ అమ్మడు కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారింది. ఐటమ్ సాంగ్స్‌లో తన అందచందాలతో ఉర్రుతలు ఊగించింది. సినిమాలో ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్ ఉండాల్సిందే అనే రేంజ్‌లో రాణించింది ఈ అమ్మడు. తెలుగులోనే కాదు తమిళ్ ,హిందీ భాషల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది. హీరోయిన్‌గాను కొన్ని సినిమాల్లో మెరిసింది ముమైత్. అయితే ఇటీవల కాలంలో ముమైత్ ఖాన్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో సందడి చేసింది.
గతంలో ఓ డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరించింది. తర్వాత బుల్లితెర నుంచి కూడా మాయం అయ్యింది. తాజాగా ముమైత్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ముమైత్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ మధ్య తనకు పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని తెలిపింది. ఆతర్వాత కోలుకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో నలుగురితో డేటింగ్ చేశానని.. వారిలో తనకు ఒక్కరు కూడా కనెక్ట్ కాకపోవడంతో బ్రేకప్ చెప్పానని తెలిపింది. ప్రస్తుతం ఒంటరిగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నానని, భవిష్యత్తులో పెళ్లి రాసి ఉంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








