Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ లక్కీ హీరోయిన్.. సినిమా తీస్తే సూపర్ హిట్టే!
ఈ అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ తో పాటు దక్షిణాది ఇండస్ట్రీలోనూ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. స్టార్ హీరోలు సైతం ఈ బ్యూటీతో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

పై ఫొటోలోని సర్కిల్ లో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ఈ ముద్దుగుమ్మ 2017 నుంచే సినిమాలు చేస్తోంది. కానీ తెలుగు ఆడియెన్స్ కు గతేడాదే పరిచయమైంది. ఆమె నటించిన ఒక మలయాళం సినిమా తెలుగులోనూ రిలీజైంది. . యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా యువతను ఈ సినిమా తెగ ఆకట్టుకుంది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ 100 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ లవ్ స్టోరీకి భారీ గా వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా అదరగొట్టింది. ఇక ఈ సినిమాలోనే తన ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది. తన అభినయంతో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడీ హీరోయిన్ పేరు మళ్లీ మార్మోగుతోంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఒక సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఆమె మరెవరో కాదు గతేడాది ప్రేమలు సినిమతో పలకరించి ఇప్పుడు డ్యూడ్ అంటూ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మమితా బైజు.
డ్యూడ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో మమితకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా ఆ కోవకే చెందుతుంది. ఈ ఫొటోలో మమిత పక్కన ఉన్నది ఆమె సోదరుడు మితున్. దీపావళి కానుకగా రిలీజైన డ్యూడ్ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మమిత అభినయానికి మరోసారి మంచి మార్కులు పడ్డాయి. అలాగే డిజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి మరో కీలక పాత్రలో ఆకట్టుకుంది.
డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ తో మమితా..
View this post on Instagram
ప్రస్తుతం మమిత చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సూర్య-వెంకీ అట్లూరి, దళపతి విజయ్ జన నాయగన్, ధనుష్ డీ 54తో పాటు పలు మూడు సినిమాలు ఉన్నాయి. త్వరలోనే ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
సూర్య సినిమాలో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








