Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాలో ఉప్పీ రోల్‌ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ ఎవరో తెలుసా?
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఆశలన్నీ ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశాడీ క్రేజీ హీరో. కేవలం హీరోగానే కాకుండా పాటలు రాసి పాడాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న రిలీజ్ కానుంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ పి. మహేశ్ బాబు ఈ సినిమాను తెరకెక్కించాడు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. అలాగే రావు రమేష్, మురళీ శర్మ, రాజీవ్ కనకాలు, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాలో చిత్రంలో హీరో అభిమాని పాత్రలో రామ్ కనిపించనున్నారు. అలాగే ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ పాత్రలో ఉప్పీ కనిపించనున్నాడు. ఆ సినిమాలో రామ్, భాగ్యశ్రీతో పాటు ఉపేంద్ర పాత్ర కూడా కీలకమని చిత్ర బృందం చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే ఉపేంద్ర కూడా సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటున్నాడు.
అయితే ఆంధ్రా కింగ్ తాలుకా సినిమాలో సూపర్ స్టార్ రోల్ కు ఉపేంద్ర ఫస్ట్ ఛాయిస్ కాదట. ముందుగా ఈ రోల్ నందమూరి బాలకృష్ణ దగ్గరకు వచ్చిందట. చిత్ర బృందం కూడా బాలయ్యను సంప్రదించిందట. అయితే అప్పటికే బాలయ్య చేతిలో పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఉండడంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాడట. దీంతో మేకర్స్ వెంటనే ఉప్పీని కలిశారట. కథ విన్న ఆయన వెంటనే ఒకే చెప్పడంతో ఆంధ్రాకింగ్ తాలుకా సినిమా పట్టాలెక్కిందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. సినిమా రిలీజ్ నేపథ్యంలో ఇప్పుడీ వార్త నెట్టింట బాగా వైరలవుతోంది.
సెన్సార్ పూర్తి చేసుకున్న రామ్ సినిమా..
It is a U/A for #AndhraKingTaluka ❤🔥 A film for all, a film relatable to all 💥
GRAND RELEASE WORLDWIDE ON NOVEMBER 27th.
BOOKINGS NOW OPEN! 🎟️ https://t.co/LKMkGbt7jv#AKTonNOV27 Energetic star @ramsayz @nimmaupendra #BhagyashriBorse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/PlAdBO6p3w
— Mythri Movie Makers (@MythriOfficial) November 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








