Raju Weds Rambai: మట్టి కథ బలం ఇది.. కలెక్షన్స్ కుమ్మేస్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’.. 4 రోజుల్లో..!
సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. విశేష ప్రేక్షకాదరణని సొంతం చేసుకుంది. సింగిల్ థియేటర్లు జనంతో కళకళలాడుతున్నాయి. చిత్ర నాలుగు రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి ...

ఇటీవలి కాలంలో మౌత్ టాక్ కారణంగా విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. మూవీలో అఖిల్ రాజ్- హీరోయిన్ తేజస్విని జంటగా నటించారు. ఇల్లెందు, మహబూబాబాద్‌లో జరిగిన యదార్థ ఘటనకు తెరరూపం ఇచ్చాడు దర్శకుడు సాయిలు. అతని మేకింగ్ స్టైల్ బాగుందని.. మట్టి కథను హృద్యంగా మలిచాడంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. థియేటర్లలో నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో తెలుసుకుందాం పదండి..
ఈ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చినప్పటి నుంచి కలెక్షన్స్ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకూ రూ. 9.08 కోట్ల గ్రాస్ రాబట్టింది. రిలీజైన ఫస్ట్ డే రూ. 1.15కోట్ల కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసుకుంది. ఆ తర్వాత శనివారం రూ. 2.15 కోట్లు రావడం విశేషం. ఆదివారం ఫుల్ హలిడే అవ్వడంతో… రూ.2.5 కోట్లు వసూళ్లు చేసింది. ఇప్పటికీ సినిమా చూసేందుకు ఆడియెన్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. కాగా సోమవారం కూడా రూ.1.31 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది ఈ చిత్రం. వచ్చే రెండు వారాల వరకు మరో పెద్ద సినిమా విడుదల ఏదీ షెడ్యూల్‌లో లేదు. సో.. రెండో వారంలో మంచి కలెక్షన్లు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మరో 100 షోలు అదనంగా యాడ్ చేశారు.
It's Boosting Day by Day
Day 4 >>> Day 1
With housefull love and crazy bookings, #RajuWedsRambai Grosses 9.08CR gross in 4 days in India 😍💥
🎟️ https://t.co/qhpw5D3M0Z pic.twitter.com/y4MlWhsddC
— Telugu Film Producers Council (@tfpcin) November 25, 2025
ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ సంస్థ వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. బన్నీ వాస్, వంశీ నందిపాటి నిర్మాతలు కలిసి చిత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణ మూలాల నుంచి తీసిన ఈ సినిమా.. ఒరిజినల్ కంటెంట్‌కు ఆడియెన్స్ ఎంత బ్రహ్మరథం పడతారో నిరూపిస్తుంది.




