Megastar Chiranjeevi: బాస్ వచ్చేస్తోండు.. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ డేట్ ఇదే.. ఈసారి బాక్స్‌లు బద్దలే..
మన శంకరవర ప్రసాద్ గారు ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు, అభిమానులు చిరంజీవి గారి నుంచి కొరుకునే ఫన్, డ్యాన్స్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ అద్భుతంగా కుదిరాయని అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' షూటింగ్ పూర్తైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మాస్ అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ రోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పూర్తి షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం విడుదల కావడం వల్ల, ఈ చిత్రం ఏడు రోజుల లాంగ్ వీకెండ్ బెనిఫిట్ పొందుతుంది. పండుగ సెలవుల పూర్తిగా కలిసిరానున్నాయి. మంచి ప్లానింగ్ తో చేసిన రిలీజ్ టైం సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద సినిమాకు బలమైన వసూళ్లను అందించి, ప్రేక్షకుల రష్ ని గరిష్ఠంగా పెంచుతుందని భావిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డైమనిక్ గా కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. రెడ్ కార్ పై బ్లాక్ సూట్ లో కాఫీ సిప్ చేస్తూ మెగా స్వాగ్ తో మెస్మరైజ్ చేశారు చిరంజీవి. అనిల్ రావిపూడి, చిరు కలయికే ఇప్పటికే చాలా ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సంచలనం సృష్టించాయి. వెంకటేష్ ప్రత్యేక పాత్ర తోడవడంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బలమైన తారాగణం ఉండటంతో అంచనాలు గణనీయంగా పెరిగాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని, తమ్మిరాజు ఎడిటింగ్‌ను, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. కథను ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సంయుక్తంగా రాశారు.
మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మరింత జోరుగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గ్రాండ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ అని అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారితో ఓపెనింగ్ ముహూర్తంతో స్టార్ట్ చేశాం. అక్కడ్నుంచి ఈ ఏడు ఎనిమిది నెలలో జర్నీ నాకు చాలా మెమొరబుల్. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. నేను ఇంకా ఆ ఎమోషన్ లోనే ఉన్నాను. మేమిద్దరం కూడా ఒక మంచి మెమోరియల్ జర్నీగా షేర్ చేసుకున్నాం. ఒకరినొకరు మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఇద్దరిలో ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి థాంక్యూ సో మచ్. సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం.. ఇప్పుడు ఇది నా నాలుగో సంక్రాంతి. నాకెప్పుడూ సంక్రాంతి అంటే ఒత్తిడి ఉండదు . హాలిడేస్ లో సరదాగా ఇంటికి వెళ్లి పండగ పూట థియేటర్స్ కి వెళ్లి ఒక మంచి ఎంటర్టైర్నర్ ని చూసే ఒక ఎనర్జీ లాగా ఫీల్ అవుతాను. అందుకే సంక్రాంతి ఎప్పుడు కూడా నా కెరియర్లో చాలా ప్రత్యేకం. లాస్ట్ సంక్రాంతికి మీరు ఎంత ఎనర్జీ ఎంజాయ్ చేశారో, అలాంటి ఎంజాయ్మెంట్ ఈ సంక్రాంతి కూడా మీకు దొరకపోతుంది.
చిరంజీవి గారి ఫన్ టైమింగ్ ఏంటో ఒక జనరేషన్ విట్నెస్ చేసింది. ఈ జనరేషన్ కి ఒక అప్డేటెడ్ వెర్షన్ తో చిరంజీవి గారు మన ముందుకు రాబోతున్నారు. చాలా ఫన్, డాన్సులు యాక్షన్ అన్నీ చాలా బాగా కుదిరాయి. ఈ సంక్రాంతికి సూపర్ ఎంటర్టైనర్ ఇది. వెంకటేష్ గారు నాకు చాలా ప్రత్యేకమైన హీరో. ఆయన నా గురువు, మెంటర్. చిరంజీవి గారు వెంకటేష్ గారిని దశాబ్దాలుగా వారిని మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి ఇద్దరినీ ఒక ఫ్రేమ్ లో చూడాలనేది సినీ లవర్స్ కి ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి అవకాశం నాకు దొరికింది. చిరంజీవి గారు వెంకటేష్ గారు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారనేది మీకు చూపించడానికి చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. ఈ సినిమాలో చేసిన వెంకటేష్ గారికి థాంక్యూ. చిరంజీవి గారిని ఆడియన్స్, ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో అలా చూపించడానికి 100% ఎఫర్ట్ పెట్టాను. ఆడియన్స్ కి ఆయన విపరీతంగా నచ్చుతారు” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..




