AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపరాజీ హంగామా వెనుక అసలు నిజం! స్టార్ హీరోయిన్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌పై ప్రియమణి సంచలన వ్యాఖ్యలు

ముంబై అంటే కేవలం బాలీవుడ్ సినిమా హంగామా మాత్రమే కాదు, సెలబ్రిటీలను ఎక్కడికైనా వెంటాడే 'పాపరాజీ' కల్చర్ కూడా! ఏ నటుడు, నటి పబ్లిక్‌లోకి వచ్చినా, ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినా, వారిని వెంబడించి ఫోటోలు, వీడియోలు తీయడం అక్కడ సర్వసాధారణం. ఈ హడావిడి చూసిన ..

పాపరాజీ హంగామా వెనుక అసలు నిజం! స్టార్ హీరోయిన్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌పై ప్రియమణి సంచలన వ్యాఖ్యలు
Priyamani And Star Heroine
Nikhil
|

Updated on: Dec 14, 2025 | 12:15 PM

Share

ముంబై అంటే కేవలం బాలీవుడ్ సినిమా హంగామా మాత్రమే కాదు, సెలబ్రిటీలను ఎక్కడికైనా వెంటాడే ‘పాపరాజీ’ కల్చర్ కూడా! ఏ నటుడు, నటి పబ్లిక్‌లోకి వచ్చినా, ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినా, వారిని వెంబడించి ఫోటోలు, వీడియోలు తీయడం అక్కడ సర్వసాధారణం. ఈ హడావిడి చూసిన నెటిజన్లు ‘వామ్మో ఈ సెలబ్రిటీలకు ఇంత క్రేజ్ ఉందా!’ అని ఆశ్చర్యపోతుంటారు. అయితే, ఈ పాపరాజీ హంగామా వెనుక ఉన్న ఒక షాకింగ్ రియాలిటీని ప్రముఖ నటి ప్రియమణి బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

డబ్బులిచ్చి నియమించుకుంటున్నారు!

ముంబైలో సెలబ్రిటీలను వెంటాడే పాపరాజీల వెనుక ఉన్న అసలు కారణాన్ని ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ముంబైలో సెలబ్రిటీలు తమకు పబ్లిసిటీ పెంచుకోవడం కోసం, ఆయా పాపరాజీలను డబ్బులు ఇచ్చి మరీ నియమించుకుంటారు!’ అంటూ ప్రియమణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. సినిమా ప్రమోషన్స్, సోషల్ మీడియాలో తమ ఉనికిని పెంచుకోవడం కోసం స్టార్స్ ఈ ‘పెయిడ్ పాపరాజీ’ ట్రెండ్‌ను నడుపుతున్నారనేది ఆమె అభిప్రాయం.

Rukmini Vasanth And Priyamani

Rukmini Vasanth And Priyamani

బర్త్‌డే సర్‌ప్రైజ్ ట్రెండ్‌లో రుక్మిణి వసంత్

ప్రియమణి వ్యాఖ్యలు నిజమో కాదో పక్కన పెడితే, ఇటీవల పాపరాజీలు సెలబ్రిటీలతో మరింత ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. పబ్లిక్ ప్లేస్‌లలో సెలబ్రిటీలకు సడన్ బర్త్ డే సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా మారింది. మొన్నామధ్య ముంబై ఎయిర్‌పోర్ట్‌లో హీరోయిన్ పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా పాపరాజీలు ఆమె చేత కేక్ కట్ చేయించిన విషయం తెలిసిందే. ఆ సర్ ప్రైజ్‌కు పూజా ఉప్పొంగిపోయింది. తాజాగా ఈ జాబితాలో చేరిన నటి రుక్మిణి వసంత్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్న రుక్మిణి వసంత్.. ‘కాంతార చాప్టర్-1’ లో యువరాణి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న రుక్మిణిని ముంబైలోని బాంద్రాలో కలిసిన పాపరాజీలు హఠాత్తుగా కేక్ తీసుకొచ్చి ఆమె చేత కట్ చేయించారు. ఈ సర్‌ప్రైజ్‌కు మురిసిపోయిన రుక్మిణి వారికి ధన్యవాదాలు తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియమణి వ్యాఖ్యలు ఏమైనప్పటికీ, పాపరాజీల సడన్ బర్త్‌డే సర్‌ప్రైజ్‌ల ట్రెండ్ మాత్రం సెలబ్రిటీలకు మరింత పాపులారిటీని తెచ్చిపెడుతోంది అనడంలో సందేహం లేదు.

పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
పాపరాజీ కల్చర్.. యంగ్ బ్యూటీపై ప్రియమణి వైరల్‌ కామెంట్లు
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?