AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS THAMAN: టాలీవుడ్​లో ఐక్యత లేదు.. నాకు చాన్స్‌లు కష్టమే! థమన్ సంచలన కామెంట్లు

మ్యూజిక్ అందిస్తే బాక్సులు బద్దలవుతాయి. ఫ్యాన్స్‌కు పూనకాలే. ఫైట్స్, సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. సెగ్మెంట్ ఏదైనా, క్లాస్, మాస్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించే మ్యూజిక్ అందిస్తారు థమన్. భారతీయ సినీ పరిశ్రమలో ప్రాంతీయ భేదాలు, అవకాశాల విషయంలో వ్యత్యాసం చాలాకాలంగా చర్చనీయాంశంగా ..

SS THAMAN: టాలీవుడ్​లో ఐక్యత లేదు.. నాకు చాన్స్‌లు కష్టమే! థమన్ సంచలన కామెంట్లు
Thaman And Music Director
Nikhil
|

Updated on: Dec 14, 2025 | 12:01 PM

Share

మ్యూజిక్ అందిస్తే బాక్సులు బద్దలవుతాయి. ఫ్యాన్స్‌కు పూనకాలే. ఫైట్స్, సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. సెగ్మెంట్ ఏదైనా, క్లాస్, మాస్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించే మ్యూజిక్ అందిస్తారు థమన్. భారతీయ సినీ పరిశ్రమలో ప్రాంతీయ భేదాలు, అవకాశాల విషయంలో వ్యత్యాసం చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా, టాలీవుడ్, కోలీవుడ్ మధ్య ఉన్న ఈ అవకాశాల తేడాపై తాజాగా ఒక ప్రముఖ సంగీత దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఎవరా మ్యూజిక్​ డైరెక్టర్​?

తెలుగు సినిమాకు విజయాలు అందిస్తూ, ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఎస్.ఎస్. థమన్. తెలుగు తమిళ సినీ పరిశ్రమల మధ్య అవకాశాల తేడాలపై థమన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమిళులకు ప్రాంతీయాభిమానం ఎక్కువగా ఉంటుందనే మాట తరచూ వినిపిస్తూనే ఉంటుందని, అదే సమయంలో తెలుగువాళ్లకు అలాంటి ఐక్యత లేదన్న విమర్శలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. ఈ వ్యత్యాసం హీరోల విషయంలో స్పష్టంగా కనబడుతుంది. తెలుగులో కార్తీ, సూర్య వంటి తమిళ హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళనాట పెద్ద స్టార్ ఇమేజ్ లేని విజయ్ సేతుపతి సినిమాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు రాబడుతున్నాయి. కానీ అదే సమయంలో తెలుగులో సూపర్ స్టార్లుగా పేరొందిన మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోల సినిమాలకు తమిళనాడులో కనీస స్థాయి కలెక్షన్లు కూడా రావడం లేదన్నది వాస్తవం.

ఈ వ్యత్యాసమే తమిళుల ప్రాంతీయాభిమానానికి నిదర్శనమని సినీ వర్గాలు అంటున్నాయి. హీరోలకే కాదు, తమిళ సంగీత దర్శకులకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్, అనిరుధ్ రవిచందర్ వంటి కోలీవుడ్ సంగీత దర్శకులు వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్లకు తమిళనాడులో అదే స్థాయిలో అవకాశాలు రావడం లేదన్నది చర్చనీయాంశంగా మారింది.

Thaman And Anirudh

Thaman And Anirudh

ఈ విషయంపై తమన్ స్పందిస్తూ.. “అనిరుధ్‌కు తెలుగులో చాలా ఈజీగా అవకాశాలు వస్తాయి. కానీ నాకు మాత్రం తమిళ సినిమాల్లో అవకాశం రావడం చాలా కష్టం. కారణం తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఐక్యత. అక్కడ వాళ్లు తమవాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి ఐక్యత అస్సలు లేదు” అంటూ వ్యాఖ్యానించారు.

తమన్ వ్యాఖ్యలు నిజమని చెప్పడానికి అనిరుధ్ పారితోషికంపై వస్తున్న పుకార్లు ఒక ఉదాహరణ. తమిళంలో ఒక సినిమాకు సుమారు రూ.4 కోట్ల వరకు తీసుకునే అనిరుధ్, తెలుగులో మాత్రం రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తాడనే ప్రచారం ఉంది. మొత్తంగా చూస్తే, తమిళ ఇండస్ట్రీలో కనిపించే ఐక్యత, ప్రాంతీయాభిమానం వల్ల అక్కడి టెక్నీషియన్లు, కళాకారులు బలంగా నిలబడుతున్నారని, తెలుగులో మాత్రం అలాంటి సమైక్యత లేకపోవడం వల్ల మనవాళ్లకే నష్టం జరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. తమన్ వ్యాఖ్యలతో ఈ అంశం ఇప్పుడు సినీ వర్గాల్లో మరోసారి పెద్ద చర్చగా మారింది.

వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి