తెలంగాణలో చలి తీవ్రత పదేళ్ల రికార్డులను బద్దలు కొడుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ వణికిపోతోంది. వాతావరణ శాఖ మరో మూడు రోజులపాటు అతి శీతల గాలులు, పొగమంచు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించి, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.