AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి గానే కలెక్షన్లు రాబట్టింది. ప్రియదర్శి, ఆనంది హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో స్టార్ యాంకర్ సుమ కనకాల ఓ కీలక పాత్ర పోషించడం విశేషం.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Premante Movie
Basha Shek
|

Updated on: Dec 14, 2025 | 12:47 PM

Share

టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి పులికొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ప్రేమంటే. నవనీత్‌ శ్రీరామ్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో మన తెలంగాణ అమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటించింది. అలాగే స్టార్ యాంకర్ సుమ కనకాల, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, అభయ్ బేతిగంటి, సురభి ప్రభావతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రానా స్పిరిట్‌ మీడియా సమర్పణలో పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, జాన్వీ నారంగ్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 21న థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఈ సినిమాకు పోటీగా ఏకంగా అరడజనకు పైగా సినిమాలు రిలీజ్ కావడం ప్రియదర్శి మూవీకి మైనస్ గా మారింది. ఫలితంగా ఈ మూవీ లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ప్రేమంటే మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది.

డిసెంబర్ 19 నుంచి ప్రేమంటే సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ‘అందమైన వైభవాల వేడుకే కదా ప్రేమంటే’ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్.  ప్రేమంటే సినిమాకు లియోన్ జేమ్స్ అందించిన స్వరాలు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ రొమాంటిక్ మూవీకి అన్వర్ అలీ, రాఘవేంద్ర తిరున్ ఎడిటర్లుగా వ్యవహరించారు. అలాగే విశ్వంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు. 

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో ప్రేమంటే సినిమా స్ట్రీమింగ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సరదాగా హీరో ప్రియదర్శి, కోర్టు మూవీ టీమ్..

మరి థియేటర్లలో ప్రియదర్శి సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?
ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
ఫోన్ ఎందుకు వేడెక్కుతుంది? అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అప్పుడే ఓటీటీలోకి రొమాంటిక్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వారానికి 2 క్యారెట్లు తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదట!
వారానికి 2 క్యారెట్లు తింటే.. జీవితంలో క్యాన్సర్‌ రాదట!
బీట్‌రూట్ Vs దానిమ్మ రసం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బీట్‌రూట్ Vs దానిమ్మ రసం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సంప్రదాయం మాత్రమే కాదు.. జడ వేసుకుంటే.. మీ జుట్టుకి షీల్డ్..
సంప్రదాయం మాత్రమే కాదు.. జడ వేసుకుంటే.. మీ జుట్టుకి షీల్డ్..
స్క్రీన్ టైమ్ ఒక్క గంట పెరిగితే ఎంత ప్రమాదమో తెలుసా?
స్క్రీన్ టైమ్ ఒక్క గంట పెరిగితే ఎంత ప్రమాదమో తెలుసా?
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
మిగిలిపోయిన చపాతీతో.. ఈ స్నాక్స్ చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
ఓటీటీలోకి హార్రర్ సినిమా.. ఒంటరిగా చూడాలంటే అంతే సంగతులు..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..
హిస్టరీ అంటే ఇంటరెస్ట్ ఉందా.? మీకు ఈ ప్లేసులు పక్కా నచ్చుతాయి..