AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess Who: డబ్బులు లేక చదువు మానేసింది.. ఒక్క పాట కోసం 5 కోట్లు.. ఈ హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా..

కుటుంబంలో ఆర్థిక సమస్యలతో ఉన్నత చదువులు చదవలేకపోయింది. పాకెట్ మనీ కోసం షాపింగ్ మాల్స్ లో పనిచేసిన ఓ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ప్రస్తుతం అగ్ర కథానాయికగా, నిర్మాతగా సక్సెస్ అయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా. ?

Guess Who: డబ్బులు లేక చదువు మానేసింది.. ఒక్క పాట కోసం 5 కోట్లు.. ఈ హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా..
Samantha
Rajitha Chanti
|

Updated on: Oct 17, 2025 | 5:35 PM

Share

దక్షిణాదిలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సినీరంగంలో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసిన ఆమె.. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో టాప్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో తెలుగు అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. అయితే టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ బ్యూటీ.. స్పెషల్ సాంగ్స్ తో అలరించింది. కేవలం 3 నిమిషాల పాట కోసం ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే వ్యక్తిగత విషయాలతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. మానసిక సంఘర్షణ, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ.. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో యాక్టివ్ అవుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సమంత. సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరోయిన్ ఆమె.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

ఏమాయ చేసావే అంటూ తెలుగు సినీప్రియుల హృదయాలను దోచుకున్న ఈ వయ్యారి.. గత 15 సంవత్సరాలుగా నటనా రంగంలో రాణిస్తుంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దళపతి, సూర్య వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత సినిమాలు తగ్గించింది సామ్. అదే సమయంలో మయోసైటిస్ సమస్యతో పోరాడింది. కొన్నాళ్లపాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సామ్.. సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

అదే సమయంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా కలిసి నటించిన పుష్ప చిత్రంలో ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ తో ఇరగదీసింది. ఈ పాట అప్పట్లో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇందులో సామ్ స్టెప్పులు, ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూడు నిమిషాల పాటకు సామ్.. ఐదు కోట్ల పారితోషికం తీసుకుందట. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే శుభం సినిమాతో నిర్మాతగా సక్సెస్ అయ్యింది సామ్. మరోవైపు కథానాయికగా ఇప్పుడిప్పుడే పలు ప్రాజెక్ట్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..